‘వర్మ తాతా.. వర్మ తాతా’.. ఆర్జీవిని ఆటపట్టించిన రాజమౌళి..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఆటపట్టించాడు..

  • Published By: sekhar ,Published On : February 10, 2020 / 08:57 AM IST
‘వర్మ తాతా.. వర్మ తాతా’.. ఆర్జీవిని ఆటపట్టించిన రాజమౌళి..

Updated On : February 10, 2020 / 8:57 AM IST

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఆటపట్టించాడు..

కాంట్రవర్సీ కింగ్, వివాదాలకు ఆప్తుడు రామ్ గోపాల్ వర్మపై దర్శక ధీరుడు రాజమౌళి సెటైర్ వేశాడు. వివరాల్లోకెళ్తే.. రామ్‌గోపాల్ వ‌ర్మ తాతయ్యాడు. ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ రేవ‌తి అమెరికాలో పండంటి పాప‌కి జ‌న్మ‌నిచ్చింది.

ఈ విష‌యం తెలిసిన రాజమౌళి వ‌ర్మ‌కు అభినంద‌నలు తెలుపుతూ, పనిలో పనిగా ఆట‌ప‌ట్టిస్తూ ఓ ట్వీట్ చేయ‌డం విశేషం. ‘‘కంగ్కాచ్యులేష‌న్స్ రాము తాత‌య్యగారు. మీకు క‌ళ్లెం వేయ‌బోతున్న మీ మ‌న‌వ‌రాలికి నా అభినంద‌న‌లు. మ‌రి మీకేం కావాలి రాము నాన్నా లేక రాము తాత‌య్య‌’’ అని రాజ‌మౌళి చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతుంది.

రాము కుమార్తె రేవతి, ప్రణబ్‌ల వివాహం 2013లో జరిగింది.  పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఈ జంట అక్కడ ఫేమస్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్‌గా పనిచేస్తున్నారు. వర్మ తాతయ్యాడని తెలిసి పలువురు సినీ ప్రముఖులు, పరిశ్రమ వర్గాల వారు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.