నేను ప్రేమించిన ఫస్ట్ అమ్మాయి: రామ్ గోపాల్ వర్మ

వివాదాల రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా పబ్లిసిటీ కోసమే. తనదైన శైలిలో ప్రచారాలను చేసుకుంటూ తన సినిమాలకు బోలెడంత హైప్ తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం లక్ష్మీస్ ఎన్టీఆర్.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ప్రచారాలతో హోరెత్తించిన వర్మ.. సినిమాలను సక్సెస్ చేసుకోవడంలో మాత్రం సక్సెస్ అవ్వలేదు.
ఇదిలా ఉంటే తన శిష్యుడు తెరకెక్కించిన ‘బ్యూటిఫుల్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను రామ్ గోపాల్ వర్మ నెత్తికి ఎత్తుకున్నాడు. జనవరి 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా.. ఆర్జీవీ మరోసారి బరిలో దిగి తనదైన శైలిలో ప్రచారం పీక్స్‌లోకి తీసుకుని వెళ్తున్నాడు. మొన్నటికి మొన్న పబ్లిక్ వేదికపై హీరోయిన్ తో సరసమాడుతూ డ్యాన్సులాడిన వర్మ.. పబ్లిక్ ని లైవ్ కి పిలిచి వోడ్కా తాగుదామా? అంటూ ఓ లైవ్ ఈవెంట్ చేశాడు.
ఈ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నేను మొట్టమొదటగా ప్రేమించిన అమ్మాయి మా అమ్మ అని అన్నారు. నాలో అన్నీ బ్యాడే.. నాలో ఏదో గుడ్ ఉండి ఉంటుందిలే అని అనుకునే వాళ్లు ఉంటారో లేదో తెలియదు కానీ నన్ను మంచోడు అనుకునేది మాత్రం అమ్మే అని చెప్పారు వర్మ.
నేను మంచోడిని అని నాకు చెప్పే ప్రయత్నం అమ్మ చేస్తుంటుందని, అయితే అది ఆమె అపోహ మాత్రమే అని అన్నారు వర్మ. ఈ సమయంలో రాముడు మంచి బాలుడు అని అక్కడివారు అరుస్తుండగా.. రాముడు మంచి బాలుడు కన్నా ఘోరమైన తిట్టు తెలుగు భాషలో లేదు అని అన్నారు వర్మ.
ఈ సంధర్భంగా మాట్లాడిన వర్మ అమ్మ.. రాము చెప్పేవి అన్నీ అబద్దాలే అని అన్నారు. నాకు కుటుంబం అవసరం లేదు అంటాడు వర్మ. అది 100శాతం అబద్ధం. వర్మ ఏక లవ్యుడు.. ఏక సంతాగ్రహి.. అంటూ చెప్పారు.