Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ వ్యూహం మొదలు.. వైఎస్ జగన్, భారతి పాత్రల్లో నటులను చూశారా!
వ్యూహం మూవీ షూటింగ్ మొదలు పెట్టేసిన రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ సినిమాలో సీఎం జగన్, వైఎస్ భారతి క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారో తెలుసా?

Ram Gopal Varma Vyooham movie shooting started Ajmal Ameer palys jagan role
Ram Gopal Varma Vyooham : రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ అంశాలు పై ఒక సినిమా తియ్యబోతున్నట్లు, దానిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ ని ఖరారు చేశాడు. ఇక ఈ మూవీ అనౌన్స్‌మెంట్ తోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో సెట్స్ లోని ఫోటోలను షేర్ చేశాడు.
Sakshi Movie Teaser : సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘సాక్షి’ టీజర్ రిలీజ్
ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), వైఎస్ భారతి (Y S Bharati) క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారు అనేది తెలియజేశాడు. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ లో జగన్ పాత్రని చేసిన అజ్మల్ అమీర్ (Ajmal Ameer) ఈ మూవీలో కూడా జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ నటించబోతుంది. ఇక మూవీలోని వీరిద్దరి లుక్స్ చుసిన ఆడియన్స్.. కరెక్ట్ గా సెట్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Gopal Varma Vyooham movie shooting started Ajmal Ameer palys jagan role

Ram Gopal Varma Vyooham movie shooting started Ajmal Ameer palys jagan role
మరి వ్యూహం షూటింగ్ మొదలు పెట్టేసిన వర్మ ఆ చిత్రాన్ని ఎప్పుడు తీసుకు రాబోతున్నాడో చూడాలి. కాగా గత ఎన్నికల ముందు కూడా RGV చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాలను తీసుకు వస్తుండడంతో ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి గతంలో తనతో వంగవీటి సినిమా తెరకెక్కించిన దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.