Devara Song : దేవర మూడో పాటపై లిరిసిస్ట్ ట్వీట్.. ఈ సాంగ్ వేరే లెవల్.. ఎన్టీఆర్ స్టెప్స్..

దేవర సాంగ్స్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తాజాగా తన ట్విట్టర్లో దేవర మూడో సాంగ్ పై ట్వీట్ చేసారు.

Devara Song : దేవర మూడో పాటపై లిరిసిస్ట్ ట్వీట్.. ఈ సాంగ్ వేరే లెవల్.. ఎన్టీఆర్ స్టెప్స్..

Ramajogaiah Sastry Tweet on NTR Devara Third Song

Updated On : August 28, 2024 / 9:58 AM IST

Devara Song : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర నుంచి మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రెండు సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో మూడో సాంగ్ కూడా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

దేవర సాంగ్స్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తాజాగా తన ట్విట్టర్లో దేవర మూడో సాంగ్ పై ట్వీట్ చేసారు. రామజోగయ్య శాస్త్రి తన ట్వీట్ లో.. మూడో పాట.. పాటకు మించిన ఆట.. కన్నుల పండగ. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి. ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అని రాసుకొచ్చారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు క్లీన్ ఆంధ్ర.. గ్రీన్ ఆంధ్ర ప్రోగ్రామ్..

దీంతో ఈ మూడో పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేయనున్నట్టు, ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సాంగ్ ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈసారి దేవర పాట తో పాటు ఎన్టీఆర్ స్టెప్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవలే దేవర నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని హింట్ ఇచ్చారు మూవీ యూనిట్.