Ramarao On Duty: రామారావు మాస్ నోటిసు.. ఏముంటుందో?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ నెల 29న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ‘రామారావు మాస్ నోటీసు’ అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మాస్ వీడియో గ్లింప్స్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ నెల 29న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్లు రామారావు హిట్టు పక్కా అనే అంచనాలు క్రియేట్ చేశాయి.
Ramarao On Duty : ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్లు ఒకే స్టేజిపై.. రవితేజ కోసం నాని..
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్లో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రామారావు అండ్ టీమ్ రెడీ అయ్యింది. ‘రామారావు మాస్ నోటీసు’ అనే పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మాస్ వీడియో గ్లింప్స్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ గ్లింప్స్ చూస్తే, ఈ సినిమాలో మాస్ ఏ రేంజ్లో ఉండబోతుందో మీకే అర్థమవుతుందని చిత్ర యూనిట్ అంటోంది.
Ramarao On Duty: కింగ్ ఆఫ్ క్రౌడ్ అంటూ రామారావు టైటిల్ సాంగ్!
ఇక రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో నటుడు వేణు తొట్టెంపూడి ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాతో రవితేజ గ్యారెంటీగా హిట్ కొడతాడని చిత్ర యూనిట్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
A glimpse of RamaRao’s MASS before the explosion in Theatres on July 29th ❤️?#RamaRaoOnDuty Mass Notice Tomorrow at 11:07 AM??
Mass Maharaja @RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @Cinemainmygenes @RTTeamWorks @LahariMusic pic.twitter.com/2erUeSsM0W
— SLV Cinemas (@SLVCinemasOffl) July 26, 2022