జై చంద్రబాబు అంటున్న రామ్ గోపాల్ వర్మ

  • Published By: vamsi ,Published On : March 22, 2019 / 03:50 AM IST
జై చంద్రబాబు అంటున్న రామ్ గోపాల్ వర్మ

Updated On : March 22, 2019 / 3:50 AM IST

నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చాక చోటు చేసుకున్న పరిణామ క్రమాన్ని లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ జై చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వెన్నుపోటు పర్వం తీసుకున్న వర్మ చంద్రబాబుపై నెగెటివ్‌గా సినిమా తీస్తూ చంద్రబాబుకి జై కొట్టడం ఏంటి? అనుకుంటున్నారా?
Read Also : OMG : హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. 1600 మంది వీడియోలు రికార్డ్, లైవ్‌లో ప్రసారం

అసలు విషయం ఏమిటంటే.. ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ సినిమాను వంద శాతం విడుదల అవుతుందని చంద్రబాబుపై నమ్మకం ఉందని, సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయకుండా విడుదల అడ్డుకోవడానికి రౌడీ ఎలిమెంట్స్‌ వాడకుండా నిరోధిస్తారనే నమ్మకం ఉందంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. జై చంద్రబాబు, జై ఎన్టీఆర్ అనే నినాదాలను కూడా  వర్మ ట్వీట్లో రాశారు.