‘రాములో రాములా’ : రచ్చ చేస్తున్న టిక్‌టాక్ వీడియో!
‘అల వైకుంఠపురములో’ : ‘రాములో రాములా’ సాంగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.. టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు..

‘అల వైకుంఠపురములో’ : ‘రాములో రాములా’ సాంగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.. టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’ పాట యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది.
ఇక దీపావళి కానుకగా రిలీజ్ చేసిన‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో’..సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాను ఊపేస్తుందీ పాట.. ఇప్పటి వరకు 11 మిలియన్స్‌కు పైగా వ్యూస్, 3 లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం.. ఇక టిక్‌టాక్‌లోనూ వైరల్ అవుతోంది. ఎవరికి తోచినట్టు వాళ్లు తమ క్రియేటివిటీతో రకరకాల స్టెప్స్‌తో ‘రాములో రాములా’ పాటను పోస్ట్ చేస్తున్నారు.
Read Also : రానా ‘1945’ ఫస్ట్ లుక్ – ఆ నిర్మాతను నమ్మొద్దు : రానా సెన్సేషనల్ కామెంట్స్
ఈ సందర్భంగా టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న రిలీజ్ కానుంది.
Hahaha ♥️ nice one #RamulooRamulaa @TiktokInd #RamulooRamulaatiktok ♥️???✨ https://t.co/DjROJIA6pv
— thaman S (@MusicThaman) October 28, 2019