సూపర్ స్టార్ సినిమాలో శివగామి?

ఇంతకుముందు మహేష్ నాని సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది రమ్యకృష్ణ.. ఇన్ని సంవత్సరాల తర్వాత మహేష్ సినిమాలో నటించనుంది..

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 10:48 AM IST
సూపర్ స్టార్ సినిమాలో శివగామి?

Updated On : April 29, 2019 / 10:48 AM IST

ఇంతకుముందు మహేష్ నాని సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది రమ్యకృష్ణ.. ఇన్ని సంవత్సరాల తర్వాత మహేష్ సినిమాలో నటించనుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి మే 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ మహేష్‌తో జతకట్టగా, అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యగా, అశ్వినీదత్, పివిపి, దిల్ రాజు నిర్మించారు. మహర్షి తర్వాత మహేష్ తన 26వ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చెయ్యబోతున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాకి సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, మహేష్ 26లో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుందట. బాహుబలిలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ, ఇప్పటివరకు ఆ రేంజ్ క్యారెక్టర్ చెయ్యలేదు.

అనిల్ రావిపూడి ఆమెని కలిసి కథ వినిపించాడనీ, కథతో పాటు తన క్యారెక్టర్ కూడా నచ్చడంతో రమ్యకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇంతకుముందు మహేష్ నాని సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది రమ్యకృష్ణ.. ఇన్ని సంవత్సరాల తర్వాత మహేష్ సినిమాలో నటించనుంది. ఈ విషయంపై మూవీ యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

వాచ్.. మహేష్, రమ్యకృష్ణ  వీడియో సాంగ్..