Rashmika Mandanna : రష్మికకి ఇలాంటి భర్త కావాలంట..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. రష్మిక మాట్లాడుతూ.. ఎవరి దగ్గర అయితే మనం సెక్యూర్ గా ఫీల్ అవుతామో, కంఫర్ట్ గా ఫీల్ అయి అన్ని విషయాలు షేర్........

Rashmika
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఇటీవలే అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ అమ్మడి రేంజ్ పెరిగింది. రష్మికకి ఇప్పుడు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా తన మొదటి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మరిన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. తాజాగా రష్మిక మందన్న శర్వానంద్ సరసన నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా రష్మిక మందన్న ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. రష్మిక మాట్లాడుతూ.. ఎవరి దగ్గర అయితే మనం సెక్యూర్ గా ఫీల్ అవుతామో, కంఫర్ట్ గా ఫీల్ అయి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామో, మనల్ని కేరింగ్ గా, సెక్యూర్ గా ఎవరు చేసుకుంటారో అతనే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్, అలాంటి వాడే భర్తగా కావాలి.” అని తెలిపింది.
Rashmika Mandanna : బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక.. విజయ్ దేవరకొండ వల్లేనా??
అంతేకాక ప్రేమ, పెళ్లి పై మాట్లాడుతూ.. ”ఇద్దరు వ్యక్తులు సమానంగా అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే లవ్ అవుతుంది. ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది. ఒకవేళ నేను లవ్ మ్యారేజ్ చేసుకొన్నా ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాను” అని తెలిపింది రష్మిక. ఇక గతంలో కన్నడ హీరో రక్షిత్ తో ప్రేమ, ఎంగేజ్మెంట్ జరిగి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.