Rashmika Mandanna : విజయ్ సరసన రష్మిక??
విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా సమ్మర్ లో విడుదల కావడానికి రెడీగా ఉంది. దాని తర్వాత తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో విజయ్ 66వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.............

Rashmika
Vijay : రష్మిక ప్రస్తుతం వరుస హిట్స్ తో, వరుస సినిమాలతో తమిళ్, తెలుగు, హిందీలలో బిజీ బిజీగా ఉంది. తాజాగా రష్మికకి మరో భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా ప్రస్తుతం వరుస హిట్స్ తో ఉన్నాడు. విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సమ్మర్ లో విడుదల కావడానికి రెడీగా ఉంది. దాని తర్వాత తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో విజయ్ 66వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
Kamal Haasan : అరవింద్ కేజ్రీవాల్‌తో కమల్‌హాసన్ మీటింగ్.. తమిళ రాజకీయాల్లో నెలకొన్న ఆసక్తి..
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ టాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నటించడానికి నేషనల్ క్రష్ రష్మికని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్. గతంలో కూడా రష్మిక పలు ఇంటర్వ్యూలలో విజయ్ ఫేవరేట్ స్టార్ అని చెప్పింది. మరి విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ రష్మికకి వస్తే కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రష్మికతో ఈ సినిమా గురించి సంప్రదింపులు జరుపుతున్నారట. అన్ని ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.