Eagle : ఓటీటీకి వచ్చేసిన ‘ఈగల్’.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది..!
రవితేజ ఈగల్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. రెండు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో ఈ సినిమాని చూడొచ్చు.

Ravi Teja Anupama Kavya Thapar Eagle Movie OTT streaming details
Eagle : ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. కావ్య తపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్ అండ్ ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. థియేటర్స్ లో మంచి ఓపెనింగ్స్ నే సంపాదించుకుంది.
దర్శకుడు కార్తీక్ టాప్ సినిమాటోగ్రాఫర్ కావడంతో సినిమాలో హాలీవుడ్ టేకింగ్ విజువల్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో ఈ చిత్రం 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. కాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో ఈ సినిమాని చూడొచ్చు. మరి థియేటర్ లో మిస్ అయ్యిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చూసేయండి.
Also read : Prabhas : ‘గామి’ ట్రైలర్ చూసి.. నేనే కావాలని ఈ వీడియో చేశాను.. ప్రభాస్ కామెంట్స్
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జర్నలిస్ట్ గా పనిచేసే నళిని(అనుపమ పరమేశ్వరన్) మార్కెట్ కి వెళ్లగా అక్కడ తలకోనలో దొరికే అరుదైన పత్తితో నేసిన ఒక క్లాత్ గురించి తెలుసుకుంటుంది. ఆ క్లాత్ ఫేమస్, దానికి చెందిన వ్యక్తి కనపడట్లేదు అని చిన్న వార్తగా తీసుకొని ఎక్కడో పేపర్లో చివరన వేస్తారు. అయితే అదే న్యూస్ రా, సిబిఐ లాంటి సంస్థలు చూసి నళిని పనిచేసే సంస్థపై దాడి చేస్తాయి. దీంతో నళిని జాబ్ పోవడంతో అంత చిన్న న్యూస్ కి ఎందుకు అందరూ రియాక్ట్ అవుతున్నారు అని తలకోన వెళ్లి దాని గురించి తెలుసుకోవడం మొదలుపెడుతుంది.
తలకోనలో ఒక్కొక్కరిని అడుగుతూ ఆ పత్తి గురించి, ఆ పత్తిని విదేశాల్లో ఫేమస్ చేసిన సహదేవ్ వర్మ(రవితేజ) గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అతను ఈగల్ అని, ప్రపంచ దేశాలు అతని కోసం వెతుకుతున్నారని, మరో పక్క అక్రమాయుధాల రవాణాలో ఆయుధాలు సరఫరా చేసేవాళ్ళని ఎవరో చంపి ఆ ఆయుధాల్ని మాయం చేయడం, సహదేవ్ వర్మ మీద జరిగిన దాడి, అతను ఆయుధాలతో ఎదుర్కున్న కథ.. ఇలా పూర్తిగా అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటుంది నళిని. అసలు సహదేవ్ వర్మ ఎవరు? రా, సిబిఐ లాంటి వాళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు? అక్రమాయుధాలకు సహదేవ్ వర్మకు ఉన్న లింక్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.