Ravi Teja : రవితేజ – హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ఈ సారి కూడా హిట్ కన్ఫర్మ్..
రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంది. 'మిస్టర్ బచ్చన్' టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Ravi Teja
Ravi Teja : మాస్ మహరాజా రవితేజ వరుస పెట్టి ప్రాజెక్టులు చేసేస్తున్నారు. ఓ వైపు యాక్షన్ మూవీ ‘ఈగల్’ విడుదలకు సిద్ధమవుతుంటే మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కొత్త సినిమా మొదలుపెట్టేసారు. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న న్యూ ప్రాజెక్టు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. మిస్టర్ బచ్చన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
Big Boss 7 : బిగ్ బాస్ విన్నర్ అతనేనా? డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది ఎవరు?
హరీష్ శంకర్ గతంలో రవితేజతో మిరపకాయ డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వాయిదా పడింది. రవితేజ గోపిచంద్ మలినేనితో అనుకున్న ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో రవితేజ-హరీష్ శంకర్ సినిమా షురూ అయ్యింది. ఈ సినిమాకి ‘మిస్టర్ బచ్చన్’ అని టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టర్‌లో స్కూటర్ పై రవితేజ కూర్చుని ఉండగా బ్యాక్ గ్రౌండ్‌లో అమితాబ్ కనిపిస్తారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ కింద ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. ఈ పోస్టర్ రవితేజ అభిమానులను ఆకట్టుకుంది.
Manchu Manoj: భూమా మౌనికా రెడ్డి ప్రెగ్నెంట్.. గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్..
#MrBachchan Naam tho suna hoga ?
Honoured to play the character with the name of my favourite @SrBachchan saab ??@harish2you @peoplemediafcy @TSeries pic.twitter.com/CHMOvgh3bo
— Ravi Teja (@RaviTeja_offl) December 17, 2023
కాగా రవితేజ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో డాన్ శీను సినిమాలో నటించారు. ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ డాన్ సినిమా ప్రభావంతో తను కూడా డాన్ కావాలని చిన్నప్పటి నుండి కలలు కంటాడు. అయితే హరీష్ శంకర్ సినిమా ఏకంగా బచ్చన్ పేరుతోనే వస్తుండటం విశేషం. కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.