Ravi Teja-Shiva Nirvana: మాస్ మహారాజ్ మారిపోయాడు.. క్లాస్ డైరెక్టర్ తో క్రైమ్ థ్రిల్లర్.. పాపం ఇద్దరికీ కష్టకాలమే..

మాస్ మహారాజ్ రవి తేజ. ఈ పేరు చెప్తే వచ్చే వైబ్రేషన్స్ వేరు.(Ravi Teja-Shiva Nirvana) ఈ సినిమా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ థియేటర్స్ లో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే విదంగా ఉంటుంది పరిస్థితి.

Ravi Teja-Shiva Nirvana: మాస్ మహారాజ్ మారిపోయాడు.. క్లాస్ డైరెక్టర్ తో క్రైమ్ థ్రిల్లర్.. పాపం ఇద్దరికీ కష్టకాలమే..

Ravi Teja-Shiva Nirvana is making a new film in the crime thriller genre.

Updated On : November 16, 2025 / 6:56 PM IST

Ravi Teja-Shiva Nirvana: మాస్ మహారాజ్ రవి తేజ. ఈ పేరు చెప్తే వచ్చే వైబ్రేషన్స్ వేరు. ఈ సినిమా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ థియేటర్స్ లో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే విదంగా ఉంటుంది పరిస్థితి. మినిమమ్ గ్యారంటీ సినిమాలు(Ravi Teja-Shiva Nirvana) చేయడంలో రవితేజ టాప్ లో ఉంటాడు. కానీ, ఈ మధ్య ఏమయ్యిందో తెలియదు ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. వరుసగా అయిదు, ఆరు సినిమాలు ఆడియన్స్ కి నచ్చడం లేదు. కనీసం ఆయన ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయడం లేదు.

Trisha: అసహ్యం వేయడం లేదా.. స్నేహితులతో లింక్ పెడతారా.. ఇకనైనా కొంచం..

దీంతో ఇకముందు చేయబోయే సినిమాలను రూట్ మార్చాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో. ఫిక్స్ అవడమే కాదు ఆచరణలో కూడా పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. శివ నిర్వాణ అంటే క్లాస్ సినిమాలకు కేరాఫ్ . నాని హీరోగా చేసిన నిన్ను కోరి, నాగ చైతన్యతో చేసిన మజిలి సినిమాలు ఎంత ఎమోషనల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించాయి. కానీ, ఈ దర్శకుడి లాస్ట్ సినిమా ఖుషి డిజాస్టర్ అయ్యింది. విజయ్ దేవరకొండ-సమంత జంటగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

కాబట్టి, ఈ దర్శకుడికి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి. అలాగే అటు రవి తేజకు కూడా ఒక సాలిడ్ కంబ్యాక్ అవసరం. కాబట్టి, ఈ ఇద్దరు కలిసి ఒక కొత్త జానర్ లో సినిమా చేయనున్నారట. అది కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో. రవి తేజ, శివ నిర్వాణ ఇప్పటివరకు ఈ జానర్ సినిమా చేయలేదు. కాబట్టి, వీళ్ళ ఇద్దరి సాలిడ్ కంబ్యాక్ కి ఈ జానర్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట ఇద్దరు. ఇక జానర్ అవడానికి క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ రవి తేజ మార్క్ మాస్ అండ్ శివ నిర్వాణ టైప్ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. అందుకే ఈ కథను ఒకే చేశాడట రవి తేజ. మరి కష్టకాలం ఓకే కొత్త జానర్ లో ఈ ఇద్దరు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.