Ravanasura: ఓటీటీలో ల్యాండింగ్‌కు రెడీ అయిన రావణాసుర.. ఎప్పుడంటే?

మాస్ రాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.

Ravanasura: ఓటీటీలో ల్యాండింగ్‌కు రెడీ అయిన రావణాసుర.. ఎప్పుడంటే?

Raviteja Ravanasura To Stream On OTT From This Time

Updated On : April 17, 2023 / 10:47 AM IST

Ravanasura: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపించడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు.

Ravanasura Movie: రావణాసుర ఫస్ట్‌డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

కథ పరంగా మంచి కంటెంట్‌తో వచ్చినప్పటికీ రావణాసుర చిత్రానికి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఫ్లాప్ మూవీగా నిలవనుంది. ఈ సినిమాపై రవితేజ మంచి అంచనాలు పెట్టుకున్నా, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు నెగెటివ్ రిజల్ట్‌ను కట్టబెట్టారు. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 7న రిలీజ్ కాగా, కేవలం నెలలోపే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుండటంతో ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ravanasura : రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు?

ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాశ్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయెల్, దక్ష నాగర్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. హీరో సుశాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేయనున్నారనే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.