Renu Desai : రాజమౌళి సినిమా కోసం నార్వే వెళ్లిన రేణు దేశాయ్, అకిరా.. రాజమౌళిపై రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్..

నార్వేలోని స్టావెంజర్‌ థియేటర్ లో బాహుబలి సినిమా స్పెషల్ షో అనంతరం అక్కడున్న వారంతా దాదాపు పది నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి రాజమౌళిని అంభినందించారు. ఆ దృశ్యాన్ని రేణు దేశాయ్ వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Renu Desai : రాజమౌళి సినిమా కోసం నార్వే వెళ్లిన రేణు దేశాయ్, అకిరా.. రాజమౌళిపై రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్..

Renu Desai Special Post on Rajamouli regarding Bahubali special show on Norway

Updated On : August 20, 2023 / 10:09 AM IST

Renu Desai :  పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పవన్ గురించి మాట్లాడిన రేణు దేశాయ్ ఇప్పుడు రాజమౌళి, బాహుబలి సినిమాల గురించి మాట్లాడి వైరల్ అవుతుంది. నార్వేలోని ప్రముఖ థియేటర్ స్టావెంజర్‌ లో బాహుబలి స్పెషల్ షో వేస్తున్నారని కొన్ని రోజుల క్రితం రాజమౌళి ప్రకటించారు. ఈ స్పెషల్ షోకి రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్ర రావు, నిర్మాత శోభు, మరికొంతమంది రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు వెళ్లారు. వీరితో పాటు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, తనయుడు అకిరా కూడా వెళ్లారు.

నిన్న రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో దీనిపై స్పెషల్ పోస్ట్ చేసింది. నార్వేలోని స్టావెంజర్‌ థియేటర్ లో బాహుబలి సినిమా స్పెషల్ షో అనంతరం అక్కడున్న వారంతా దాదాపు పది నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి రాజమౌళిని అంభినందించారు. ఆ దృశ్యాన్ని రేణు దేశాయ్ వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Producer Appi Reddy : సినిమాల రీ రిలీజ్‌లపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తా.. రీ రిలీజ్‌ల వల్ల చిన్న సినిమాలకు ఎఫెక్ట్..

అక్కడి ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన వీడియోని షేర్ చేస్తూ.. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందటం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సర్ మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. స్టావెంజర్‌ థియేటర్లో బాహుబలి సినిమా చూసిన అనుభవం మర్చిపోలేను. ఈ కార్యక్రమానికి నన్ను, అకిరాని ఆహ్వానించినందుకు శోభు సర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపింది రేణు. దీంతో రాజమౌళి, బాహుబలిపై రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)