Tiger Nageswara Rao : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అప్డేట్ ఇచ్చిన రేణూదేశాయ్.. వీడియో వైరల్..
రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రేణూ దేశాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రేణూదేశాయ్ ఈ మూవీ అప్డేట్ ఇచ్చింది.

Renu Desai start dubbing for RavitejaTiger Nageswara Rao
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ఇప్పటి వరకు ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 19’s కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రాబోతుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుంటే అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
Allu Arjun – Kriti Sanon : నేషనల్ అవార్డు విన్నర్స్ బన్నీ, కృతి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా..?
ఇక చాలా గ్యాప్ తరువాత ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీలో ఒక కీలక పాత్రని రేణూదేశాయ్ పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈక్రమంలోనే డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టారు. తాజాగా రేణూదేశాయ్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ స్టార్ట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో ఆమె తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నారు. అయితే రేణూదేశాయ్ ఈ సినిమాలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది మాత్రం మేకర్స్ ఇప్పటివరకు తెలియజేయలేదు.
OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానికి అదిరే రిప్లై ఇచ్చిన నిర్మాత.. బర్త్ డేకి టాలీవుడ్..!
View this post on Instagram
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమిళ్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్రంతోనే రవితేజ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.