రిపోర్టర్ చేతనా కపూర్‌కు సారీ చెప్పిన దుల్కర్, డైరెక్టర్.. అలా చూపించినందుకే..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 12:47 PM IST
రిపోర్టర్ చేతనా కపూర్‌కు సారీ చెప్పిన దుల్కర్, డైరెక్టర్.. అలా చూపించినందుకే..

Updated On : April 27, 2020 / 12:47 PM IST

పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే విషయంలో కానీ, సినిమాల్లో ఓ స్త్రీ గురించి చెప్పేటప్పుడు కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం బాడీ షేమింగ్‌ను అందరూ తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్న నేపథ్యంలో అటువంటి అంశాల జోలికి అసలు పోకపోతే బెటర్. తాజాగా మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘వారనె అవశ్యముండ్’ సినిమాలో ఇలాంటి విషయం గురించి ముంబైకి చెందిన రిపోర్టర్ చేతనా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సినిమాలో తన ఫొటోను అవమానకరంగా ఉపయోగించారని, అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని, సినిమా నుంచి తన ఫొటోను తొలగించాలని లేదా బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ చేతన ట్వీట్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు. దీంతో దుల్కర్ సల్మాన్ వెంటనే స్పందించాడు. ‘దీనికి మేం పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో నేను తెలసుకుంటాను. మీ ఫొటోను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మా టీమ్‌ని కనుక్కుంటాను. నా తరపున, మా చిత్రబృందం తరపున క్షమాపణలు చెబతున్నాను’ అంటూ దుల్కర్ రిప్లై ఇచ్చాడు. అలాగే దర్శకుడు అనూప్ సత్యన్ కూడా చేతనకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. Varane Avashyamund చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 7న మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించింది. దుల్కర్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించగా.. శోభన, సురేష్ గోపి కీలక పాత్రలు పోషించారు.