Ram Gopal Varma : చిరంజీవి ఒక బిగ్ ఫెయిల్యూర్ పర్సన్.. రామ్ గోపాల్ వర్మ!

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ'. మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి ఒక బిగ్ ఫెయిల్యూర్ పర్సన్ అంటూ..

Ram Gopal Varma : చిరంజీవి ఒక బిగ్ ఫెయిల్యూర్ పర్సన్.. రామ్ గోపాల్ వర్మ!

RGV comments on chiranjeevi

Updated On : December 9, 2022 / 8:14 AM IST

Ram Gopal Varma : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ‘డేంజరస్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ 10tv ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ram Gopal Varma : రామ్‌చరణ్ చాలా బోరింగ్ పర్సన్.. రామ్ గోపాల్ వర్మ!

‘మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి రాకపోయి ఉంటే, మరే రంగంలో రాణించేవారని మీ అభిప్రాయం’ అనే ప్రశ్నకు వర్మ బదిలిస్తూ.. “చిరంజీవి యాక్టింగ్ కెరీర్ లో కాకుండా మిగతా అన్ని రంగంలో ఒక బిగ్ ఫెయిల్యూర్ గా నిలిచేవారు. ఆయనకి ఉన్న మెంటాలిటీకి సినిమాలు కాకుండా ఏది చేసిన పెద్ద ప్లాప్ అయ్యేవారని నా ఫీలింగ్” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా ప్రెజెంట్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ని పూర్తీ చేసే పనిలో పడ్డాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, హీరో రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ నిన్న యూరప్ బయలుదేరింది.