Ram Gopal Varma : చంద్రబాబుకి ప్రజలు ప్రాణాలు గడ్డితో సమానం.. రామ్ గోపాల్ వర్మ!

సినీ విమర్శలే కాకుండా రాజకీయ విమర్శలు కూడా చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ర్యాలీ షోలు, భహిరంగ సభలు గురించి వివాదం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభల్లో తొక్కిసలాట జరిగి వరుస మరణాలు నమోదు కావడంతో ఈ వివాదం రాచుకుంది. దీనిపై వర్మ తనదైన శైలిలో విమర్శలు చేశాడు.

Ram Gopal Varma : చంద్రబాబుకి ప్రజలు ప్రాణాలు గడ్డితో సమానం.. రామ్ గోపాల్ వర్మ!

RGV commnets on Chandrababu Naidu

Updated On : January 6, 2023 / 9:16 AM IST

Ram Gopal Varma : సినీ విమర్శలే కాకుండా రాజకీయ విమర్శలు కూడా చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ర్యాలీ షోలు, భహిరంగ సభలు గురించి వివాదం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభల్లో తొక్కిసలాట జరిగి వరుస మరణాలు నమోదు కావడంతో ఈ వివాదం రాచుకుంది. దీనిపై వర్మ తనదైన శైలిలో విమర్శలు చేశాడు.

Ram Gopal Varma : ‘జీసస్’గా రామ్ గోపాల్ వర్మ..

‘చంద్రబాబు నాయుడు గారు నేను మిమ్మల్ని అడిగే స్ట్రెయిట్ క్యూస్షన్ ఏంటంటే.. మీరు మూడు సారులో, మూడు వందల సారులో సీఎంగా పని చేసి ఉండవచ్చు. అలాంటి మీకు ప్రజలు అంటే ఏంటో తెలియదా? ఎలాంటి చోట ఏమి చేస్తే ఏమేమి పరిస్థితులు ఎదురుకుంటామో అనేది మీకు తెలియదా? మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ప్రజలు ప్రాణాలు అంటే గడ్డితో సమానం. మీ యొక్క వ్యక్తిగత లబ్ది కోసం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శించాడు.

అలాగే కానుకలు ఇస్తాను అంటూ ప్రజలకి లంచం ఇచ్చే పద్దతిని ప్రవేశ పెట్టిందే చంద్రబాబు అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆధారంగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలు ఆంధ్రాలోని కొందరి రాజకీయ నాయకులను టార్గెట్ చేసేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.