RGV : 35 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్.. అప్పట్లో ఆర్జీవీ జస్ట్ 75 లక్షలు పెట్టి తీస్తే.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అసలు అప్పట్లో శివ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా? శివ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయో తెలుసా? (RGV)
RGV
RGV : ఆర్జీవీ – నాగార్జున కాంబోలో వచ్చిన మొదటి సినిమా, బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా శివ. 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి శివ సంగతులు వైరల్ గా మారాయి. 1989 లో శివ సినిమా రిలీజయింది.
అసలు అప్పట్లో శివ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా? శివ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయో తెలుసా?
శివ సినిమాకు అప్పట్లో దాదాపు 75 లక్షల బడ్జెట్ అయింది. ఇప్పుడు అయితే ఆ బడ్జెట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ కి కూడా రావేమో. 75 లక్షల్లో ఆర్జీవీ శివ సినిమాని తీశారు. మొదట తెలుగులో రిలీజ్ చేసారు. తెలుగులో పెద్ద హిట్ అయింది. తెలుగులో శివ సినిమా ఓవరాల్ గా నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం నైజం ఏరియాలోనే ఒక కోటి రూపాయలు కలెక్షన్స్ సాధించింది శివ సినిమా.
ఆ తర్వాత శివ సినిమా ఉద్యం పేరుతో తమిళ్ లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. తమిళ్ లో శివ సినిమా ఏకంగా రెండు కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అనంతరం 1990లో శివ సినిమాని హిందీలో అదే పేరుతో రీమేక్ చేసారు. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి హిందీ రీమేక్ తీశారు ఆర్జీవీ. హిందీ సినిమాకు ఒక కోటి 15 లక్షలు ఖర్చు అయింది. హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించి అక్కడ కూడా పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ రీ రిలీజ్ లో శివ సినిమా ఎన్ని కోట్లు తెచ్చిపెడుతుందో చూడాలి.
