RGV – Dawood Ibrahim : నేను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ లో మాట్లాడాను.. కానీ.. ఆర్జీవీ వ్యాఖ్యలు..
తాజాగా ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా దావూద్ ఇబ్రహీం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

RGV said he Spoke with Mafia Don Dawood Ibrahim in Phone Call
RGV – Dawood Ibrahim : ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రస్తుతం తన ట్వీట్స్ తో, తన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తారు. గతంలో ఆర్జీవికి మాఫియాతో, అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని, ఆర్జీవీ తీసిన బాలీవుడ్ సినిమాల్లో మాఫియా డబ్బులు పెట్టిందని, దావూద్ ఇబ్రహీం ఆర్జీవీకి పరిచయం అని అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేకపోయినా ఆర్జీవీ బాలీవుడ్ లో ఏలిన సమయంలో మాఫియా – ఆర్జీవీ కి మంచి సంబంధాలే ఉన్నాయి అని రూమర్లు వచ్చేవి.
తాజాగా ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా దావూద్ ఇబ్రహీం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
తనకు మాఫియాకు ఉన్న సంబంధాల గురించి స్పందించకపోయినా ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను ఒక్కసారే దావూద్ ఇబ్రహీంతో ఫోన్ లో మాట్లాడాను. అది కూడా అతనేనా కాదా అని నాకు కన్‌ఫర్మ్ లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ గా చూడలేదు కేవలం ఫోన్ లో మాట్లాడాను. నాకు తెలిసిన వాళ్ళు దావూద్ కి క్లోజ్ అని తెలుసు. అతను ఫోన్ నుంచే ఫోన్ చేసి మాట్లాడించాడు. ఇది జరిగి 20 ఏళ్ళు పైనే అవుతుంది. కంపెనీ సినిమా గురించి రీసెర్చ్ కోసం మాట్లాడాను అని తెలిపాడు.
Also See : Pragya Jaiswal : ఉఫ్.. మోడ్రన్ డ్రెస్ లో ప్రగ్య జైస్వాల్ పరువాల జాతర..