Rithu Chowdary : నాకు పెళ్లి అవ్వలేదు.. ఆ పెళ్లి ఫోటోల గురించి నేను మాట్లాడను.. రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి..
తాజాగా రీతూ చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.

Rithu Chowdary Gives Clarity on Love and Marriage with Srikanth
Rithu Chowdary : ఓ సంవత్సరం క్రితం నటి రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే అబ్బాయిని పరిచయం చేస్తూ తనే నా ఫియాన్సీ, త్వరలో పెళ్లి చేసుకుంటాం అని అధికారికంగానే చెప్పింది. శ్రీకాంత్ తో క్లోజ్ గా ఉన్న అనేక ఫోటోలు కూడా షేర్ చేసింది రీతూ చౌదరి. శ్రీకాంత్ హైదరాబాద్ కి చెందిన ఓ పొలిటీషియన్, బిజినెస్ మెన్. గతంలో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి, పెళ్లి ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.
అయితే వీరిద్దరూ విడిపోయారని కూడా రూమర్స్ వినిపించాయి. తాజాగా రీతూ చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.
Also Read : #Single : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ అదరగొట్టారుగా..
రీతూ చౌదరి మాట్లాడుతూ.. మేము ఒక సంవత్సరం రిలేషన్ లో ఉన్నాము. మా ఇద్దరికీ సెట్ అవ్వలేదు. నాకు పెళ్లి అవ్వలేదు. ఆ పెళ్లి ఫోటోల గురించి నేను మాట్లాడాను, అది నా పర్సనల్. అది అసలు పెళ్లి లాంటిదే కాదు. ఆ ఫోటోలు ఎవరో లీక్ చేసారు. నేను ఆ ఫోటోలు పెట్టలేదు. బ్రేకప్ రీజన్ చెప్పను. ఇద్దరం అనుకొనే బ్రేకప్ అయ్యాము. రిలేషన్ షిప్ అనేది ఒక ట్రామా, ఒక టాక్సిక్ లాంటిది నాకు. లైఫ్ లో నేను పెళ్లి చేసుకోను, ఇలా సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో పెళ్లి చేసుకో అంటారు, వాళ్లకు అర్దమయ్యేట్టు చెప్తాను. మా నాన్న లాంటి అబ్బాయి, నాకు నచ్చే అబ్బాయి దొరికినప్పుడు ఆలోచిస్తాను కానీ అలాంటివాళ్ళు లేరు అని చెప్పుకొచ్చింది.
దీంతో తనకు శ్రీకాంత్ తో పెళ్లి అయింది కానీ విడిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకు విడిపోయిందో మాత్రం చెప్పలేదు. మొత్తానికి రీతూ ప్రస్తుతం సింగిల్ అని, ఎలాంటి రిలేషన్ లోకి వెళ్ళను అని క్లారిటీ ఇచ్చింది.
Also Read : Rithu Chowdary : 700 కోట్ల స్కామ్ పై ‘రీతూ చౌదరి’ కామెంట్స్.. YS జగన్ పేరుని ప్రస్తావిస్తూ..