Yash : బాలీవుడ్ ‘రామాయణం’ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యశ్.. నిర్మాతగా కూడా..

తాజాగా నేడు బాలీవుడ్ రామాయణంపై క్లారిటీ వచ్చేసింది.

Yash : బాలీవుడ్ ‘రామాయణం’ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యశ్.. నిర్మాతగా కూడా..

Rocking Star Yash and Producer Namit Malhotra Producing Epic Ramayanam Movie in Bollywood

Updated On : April 12, 2024 / 3:10 PM IST

Yash : బాలీవుడ్(Bollywood) లో నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం భారీగా తెరకెక్కిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తూ వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఎవరూ అధికారికంగా క్లారిటి ఇవ్వలేదు. తాజాగా నేడు ఈ రామాయణంపై క్లారిటీ వచ్చేసింది.

బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాగా రామాయణాన్ని భారీగా నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ నిర్మాణంలో ఈ రామాయణాన్ని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. తన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా రామాయణం నిర్మాణంలో పాలుపంచుకోనుంది. హాలీవుడ్ లో ఎన్నో భారీ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన DNEG సంస్థ ఈ రామాయణానికి కూడా అవిజువల్ ఎఫెక్ట్స్ అందించబోతుంది.

ఎన్నో హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ లో పనిచేసిన DNEG విజువల్ ఎఫెక్ట్స్ అధినేత, నిర్మాత నమిత్ మల్హోత్ర నేడు యశ్ తో దిగిన ఫోటో షేర్ చేసి రామాయణం సినిమా గురించి మాట్లాడాడుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. US, UK, ఇండియా లాంటి దేశాల్లో వ్యాపారాల్లో సక్సెస్ అయి పలు సినిమాలతో మెప్పించిన నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీస్తున్నాను. కర్ణాటక నుండి వచ్చి ఈ రోజు ప్రపంచం గర్వించే KGF 2 సినిమా వరుకు యశ్ చాలా కష్టపడ్డాడు. అతనితో కలిసి ఈ ప్రాజెక్టు చేయడం గర్వంగా అంది అని తెలిపాడు.

Also Read : Bijay Anand : ‘ఆదిపురుష్’ ట్రోల్స్‌పై నటుడు సంచలన వ్యాఖ్యలు.. నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి..

దీనిపై యశ్ కూడా స్పందిస్తు.. నాకు ఎప్పట్నుంచో మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని కల. నేను, నమిత్ రామాయణం చేస్తే బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాం. అంత పెద్ద సబ్జెక్టు తీయాలి అంటే ఖర్చు కూడా భారీగానే అవుతుంది. అందుకే నిర్మాణంలో నేను కూడా భాగమయ్యను. రామాయణానికి నా మనసులో ఒక మంచి స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. దీనికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తారు అని తెలిపాడు.

దీంతో బాలీవుడ్ రామాయణం ప్రాజెక్టు ఫిక్స్ అయినట్టే. ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నా రామాయణంలోని ఏ ఏ పాత్రలని ఎవరెవరు చేస్తారో ఎదురుచూడాలి. మరి ఈ రామాయణాన్ని ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.