RRR Movie : సైమా అవార్డుల్లో RRR హంగామా.. ఎన్ని కేటగిరీల్లో గెలుచుకుందో తెలుసా?

త సంవత్సరం రిలీజయిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన సైమా అవార్డుల్లో కూడా RRR హవా కొనసాగింది.

RRR Movie : సైమా అవార్డుల్లో RRR హంగామా.. ఎన్ని కేటగిరీల్లో గెలుచుకుందో తెలుసా?

RRR Movie winning more awards in SIIMA 2023 at Dubai including Best Actor Best Director

Updated On : September 16, 2023 / 11:04 AM IST

RRR Movie :  సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(SIIMA) 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిన్న సెప్టెంబర్ 15న జరిగాయి. రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరుగుతుండగా నిన్న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరగగా నేడు తమిళ్, మలయాళం సినీ పరిశ్రమలకు సంబంధించిన వేడుక జరగనుంది. దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక తెలుగులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డులు గెలుచుకున్నారు. గత సంవత్సరం రిలీజయిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా నాటు నాటు సాంగ్ తో ఆస్కార్, గోల్డెన్ గ్లొబ్ అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత కూడా RRR సినిమా మరిన్ని వేదికలపై మరిన్ని అవార్డులు గెలుచుకుంటూనే ఉంది.

Jr NTR – Rishab Shetty : మరోసారి కన్నడలో మాట్లాడి ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్.. సైమాలో రిషబ్ – ఎన్టీఆర్ సంభాషణ వైరల్..

తాజాగా జరిగిన సైమా అవార్డుల్లో కూడా RRR హవా కొనసాగింది. RRR సినిమా మొత్తం 11 కేటగిరీల్లో నామినేట్ అవ్వగా ఏకంగా 5 అవార్డులు గెలుచుకొని టాప్ లో ఉంది. ఉత్తమ నటుడు – ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడు – రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడు – MM కీరవాణి, ఉత్తమ సినిమాటోగ్రఫీ – KK సెంథిల్ కుమార్, ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్ (నాటు నాటు సాంగ్) లకు RRR సినిమాకు గాను అవార్డులు వచ్చాయి. దీంతో RRR యూనిట్ కి అందరూ మరోసారి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వేడుకల్లో అందరూ అవార్డులు అందుకోగా రాజమౌళి, కీరవాణి మాత్రం అవార్డుల వేడుకకు హాజరు కాలేదు. ఇక RRR సినిమా తర్వాత సీతారామం సినిమా మూడు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది.