CCL 2023 : తెలుగు వారియర్స్‌ని ఫైనల్స్‌కి తీసుకు వెళ్లిన థమన్..
నిన్న CCL మ్యాచ్స్ సెమీ ఫైనల్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సెమీ ఫైనల్స్ లో తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్ డోజర్స్ తో తలబడింది. ఇక ఈ మ్యాచ్ థమన్ (S S Thaman) తన బ్యాటింగ్ తో తెలుగు వారియర్స్ ని ఫైనల్స్ కి తీసుకువెళ్లాడు.

S S Thaman taking Telugu Warriors to finals in CCL
CCL 2023 : సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలకి దేశం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మరి ఈ రెండు కలిసి ఒకే ప్లాట్‌ఫార్మ్ పైకి వస్తే.. అదే సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL). కొంతకాలంగా జరగకుండా ఆగిపోయిన ఈ లీగ్ మ్యాచ్స్ ఇటీవలే మల్లి తిరిగి మొదలయ్యాయి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. మొత్తం 8 టీమ్స్ 16 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో సెమీ ఫైనల్స్ కి భోజపురి దబాంగ్స్ (Bhojpuri Dabanggs), ముంబై హీరోస్ (Mumbai Heroes), తెలుగు వారియర్స్ (Telugu Warriors), కర్ణాటక బుల్ డోజర్స్ (Karnataka Bulldozers) చేరుకున్నాయి.
CCL 2023 : టేబుల్ టాప్‌లో తెలుగు వారియర్స్, చివరిలో బాలీవుడ్.. అఖిల్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో తెలుసా?
ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిన్న (మార్చి 23) విశాఖపట్నంలో జరిగాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ భోజపురి దబాంగ్స్ అండ్ ముంబై హీరోస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లు రెండు ఇన్నింగ్స్ గా జరగుతున్న విషయం తెలిసిందే.
బ్యాటింగ్ కి దిగిన ముంబై టీం మొదటి ఇన్నింగ్స్ లో (10 ఓవర్లు) 109 పరుగులు తీయగా, భోజపురి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 80 పరుగులు మాత్రమే తీశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ముంబై టీం 62 పరుగులు తీసి.. మొత్తం మీద 92 పరుగులు టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్ ని భోజపురి ఛేదించి ఫైనల్స్ కి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ మ్యాచ్ తరువాత అందరి ద్రుష్టి తెలుగు వారియర్స్ అండ్ కర్ణాటక బుల్ డోజర్స్ మ్యాచ్ పై పడింది.
RRR : RRR ప్రభంజనానికి ఏడాది.. ఊహకి అందని అవార్డులు.. లెక్కకి మించిన రివార్డులు..
టాస్ గెలిచి అఖిల్ (Akhil Akkineni) సేన.. బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. ఇక బ్యాటింగ్ దిగిన కర్ణాటక 5 వికెట్స్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ తరువాత తెలుగు వారియర్స్ బ్యాటింగ్ కి దిగి మొదటి ఇన్నింగ్స్ ని 5 వికెట్స్ కోల్పోయి 95 పరుగులతో ముగించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కర్ణాటక టీం మళ్ళీ 5 వికెట్స్ కోల్పోయి 98 పరుగులు చేసింది. దీంతో తెలుగు వారియర్స్ మొత్తం మీద 103 పరుగులు టార్గెట్ ఛేదించాల్సి ఉంది. చివరి ఓవర్ వచ్చేపాటికి 6 వికెట్లు కోల్పోయి గ్రీస్ లో థమన్ (S S Thaman), ప్రిన్స్ ఉన్నారు.
6 బంతుల్లో 8 పరుగులు చేయాలన్న సమయంలో.. థమన్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. ఓవర్ లో మొదటి బంతినే బౌండరీ (4) పంపించేశాడు. ఆ తరువాత ఒక సింగల్ తీసి ప్రిన్స్ స్ట్రైక్ ఇచ్చాడు. ప్రిన్స్ కూడా ఒక సింగల్ తీసి మళ్ళీ థమన్ కి స్ట్రైక్ ఇచ్చాడు. ఇక 3 బంతుల్లో 2 పరుగులు తీయాలి అన్న సమయంలో.. థమన్ 4 కొట్టి తెలుగు వారియర్స్ ని ఫైనల్స్ కి తీసుకువెళ్లాడు. మొత్తం 15 బంతుల్లో 25 పరుగులు చేసి నిన్నటి మ్యాచ్ లో హీరోగా నిలిచాడు థమన్. కాగా ఇంతకుముందు మ్యాచ్స్ తో పోలిస్తే.. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అసలు నిన్న తెలుగు వారియర్స్ ఫీల్డింగ్ చూసి ఫైనల్స్ కి రావడం కష్టం అనుకున్నారు అభిమానులంతా. అయితే ఫీల్డింగ్ లో జరిగిన తప్పుని బ్యాటింగ్ తో కవర్ చేశారు. ఇవాళ జరిగే ఫైనల్స్ కూడా ఇదే ఫీల్డింగ్ కొనసాగిస్తే ఇబ్బందిలో పడే అవకాశం ఉంది.
CCL 2023 Live – Semi-final 2 | Telugu Warriors vs Karnataka Bulldozers | #A23Rummy #HappyHappyCCL.#CCL2023 #ChaloSaathKhelein #LetsPlayTogether #AkhilAkkineni #KichchaSudeep #GoldenstarGanesh #Thaman #A23 #CCL https://t.co/1W1Slj99Iq
— CCL (@ccl) March 24, 2023