Sakshi Dhoni : పవన్ కళ్యాణ్, ప్రభాస్‌కి ఇచ్చేంత మనీ నా దగ్గర లేదు.. ధోని భార్య సాక్షి!

పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ కి రెమ్యూనరేషన్ ఇచ్చేంత మనీ తన దగ్గర లేదంటున్న ధోని భార్య సాక్షి.

Sakshi Dhoni : పవన్ కళ్యాణ్, ప్రభాస్‌కి ఇచ్చేంత మనీ నా దగ్గర లేదు.. ధోని భార్య సాక్షి!

Sakshi Dhoni said she didnt afford Pawan Kalyan and Prabhas

Updated On : July 25, 2023 / 1:18 PM IST

Sakshi Dhoni : ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని (MS Dhoni).. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు అన్ని అతని సతీమణి సాక్షి చూసుకుంటుంది. ఇక ఈ నిర్మాణ సంస్థలో మొదటి ప్రాజెక్ట్ గా LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే తమిళ్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా (Ivana) హీరోహీరోయిన్లగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Sakshi Dhoni : అల్లు అర్జున్‌కి నేను పెద్ద ఫ్యాన్.. తన సినిమాలు చూస్తూనే పెరిగాను.. ధోని భార్య సాక్షి!

ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఇక్కడ ప్రమోషన్స్ లో భాగంగా సాక్షి, హరీష్, ఇవానాతో పాటు చిత్ర యూనిట్ టాలీవుడ్ మీడియాతో హాజరయ్యింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి సాక్షిని ప్రశ్నిస్తూ.. ‘పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ వంటి టాలీవుడ్ స్టార్స్ ఏమన్నా సినిమాలు చేస్తారా?’ అని అడిగారు. దానికి సాక్షి బదులిస్తూ.. “వారిద్దరూ చాలా పెద్ద స్టార్స్. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ గారికి ఇచ్చేంత మనీ ప్రస్తుతం నా దగ్గర లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Baby Actress Kirrak Seetha : కిర్రాక్ సీతకు అత్యాచార బెదిరింపులు.. ఆ రోజు కొంద‌రు పాలో అయ్యారు..

ఇదే ప్రెస్ మీట్ లో మరో విలేకరి.. ‘ధోని హీరోగా పెట్టి సినిమా తీసే అవకాశం ఏమన్నా ఉందా?’ అని ప్రశ్నించగా, సాక్షి బదులిస్తూ.. “ఏమో జరగవచ్చు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాని రమేష్ తమిళమణి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.