Sakshi Dhoni : అల్లు అర్జున్‌కి నేను పెద్ద ఫ్యాన్.. తన సినిమాలు చూస్తూనే పెరిగాను.. ధోని భార్య సాక్షి!

అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్ అని, తన సినిమాలు చూస్తూనే పెరిగాను అంటుంది ధోని భార్య సాక్షి.

Sakshi Dhoni : అల్లు అర్జున్‌కి నేను పెద్ద ఫ్యాన్.. తన సినిమాలు చూస్తూనే పెరిగాను.. ధోని భార్య సాక్షి!

Sakshi Dhoni said she is a big fan of Allu Arjun and watch all his movies

Sakshi Dhoni – Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో టాలీవుడ్, మాలీవుడ్, తాజాగా బాలీవుడ్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఫేమ్ ని తెచ్చుకున్నాడు. డేవిడ్ వార్నర్ (David Warner) వంటి క్రికెట్ స్టార్స్ కూడా అల్లు అర్జున్ ని విపరీతంగా అభిమానిస్తుంటారు. తాజాగా ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని (MS Dhoni) సతీమణి సాక్షి కూడా బన్నీకి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చింది.

MM Keeravaani : చంద్ర‌ముఖి-2కి ప్రాణం పోసేందుకు రెండు నెల‌లు నిద్ర‌లేని రాత్రులు

ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సాక్షి సినిమాలు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. తమ ప్రొడక్షన్ లో మొదటి ప్రాజెక్ట్ గా LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే తమిళ్ సినిమాని తీసుకు వస్తున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా (Ivana) జంటగా నటిస్తున్న ఈ మూవీ.. తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ కాబోతుంది. తమిళంలో ఇటీవల ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. తాజాగా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ మీడియాతో హైదరాబాద్ లో ఇంటరాక్ట్ అయ్యారు.

Yash : కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా దిల్ రాజు సినిమా.. ‘ఆకాశం దాటి వస్తావా’

ఈ ఇంటరాక్షన్ హీరోహీరోయిన్లతో పాటు నిర్మాత సాక్షి కూడా పాల్గొంది. ఇక ఈ కార్యక్రమంలో ఒక విలేకరి సాక్షిని.. ‘మీరు తెలుగు సినిమాలు ఏవైనా చూశారా?’ అని ప్రశ్నించాడు. దానికి సాక్షి బదులిస్తూ.. “నేను అల్లు అర్జున్ సినిమాలు అన్ని చూస్తాను. ఒకప్పుడు ఓటీటీ ఉండేది కాదు. కానీ యూట్యూబ్ లో తెలుగు మూవీస్ ని డబ్ చేసి పెట్టేవాళ్ళు. అలా అల్లు అర్జున్ సినిమాలు చూడడం మొదలుపెట్టి తనకి పెద్ద ఫ్యాన్ అయ్యిపోయాను. తను సినిమా చూస్తూనే పెరిగాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని బన్నీ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.