Salaar: సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోన్న సలార్.. ఎప్పుడొస్తుందంటే..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీంతో ఈ సినిమా నుండి ఓ సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Salaar: సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోన్న సలార్.. ఎప్పుడొస్తుందంటే..?

Salaar To Give Surprise In This Month

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Salaar: లాస్ట్ ఫినిషింగ్ ఇస్తోన్న సలార్.. ఇక దూకుడు పెంచడం ఖాయం!

అయితే, ఇప్పుడు ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను కూడా స్టార్ట్ చేసిందట చిత్ర యూనిట్. హైదరాబాద్‌లో ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ముగించేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలాఖరు వరకు ముగించేసి, ఓ సర్‌ప్రైజ్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

Salaar : రెండు భాగాలుగా సలార్.. కన్‌ఫార్మ్ చేసిన నటుడు దేవరాజ్!

ఈ నెల చివరిలో లేదా మే తొలి వారంలో సలార్ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఖాయమని తెలుస్తోంది. మరి నిజంగానే సలార్ నుండి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.