Salman Khan: కొవిడ్ పేషెంట్ల కోసం 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంతుగా గ్రాండ్ గా 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు రెడీ చేశాట. ఈ సంగతిని తానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు సల్మాన్ భాయ్.

Salman Khan: కొవిడ్ పేషెంట్ల కోసం 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్

Salman Khna

Updated On : May 20, 2021 / 11:47 PM IST

Salman Khan: కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా భయంతో బతకాల్సిన పరిస్థితి. పొరబాటున కొవిడ్ పాజిటివ్ వచ్చిందా.. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే. ఆర్థికంగా నిలదొక్కుకునే వారు పరవాలేదు కానీ, ఆర్థిక స్థోమత లేని వారు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తిరగలేక ఆక్సిజన్ కోసం పడరాని పాట్లు పడుతుననారు.

ఇటువంటి క్లిష్ట సమయంలో సెలబ్రిటీలు తమకు తోచినంత సహాయం చేసి తామున్నామని ఆదుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంతుగా గ్రాండ్ గా 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు రెడీ చేశాట. ఈ సంగతిని తానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు సల్మాన్ భాయ్.


‘మన ఫస్ట్ లాట్ వచ్చేసింది. ముంబైకు 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు వచ్చాయి’ అని పోస్టులో పేర్కొంటూ ఇవి పూర్తిగా ఉచితం. మీరు వాడుకుని అవసరం తీరిపోయాక తిరిగి ఇచ్చేయండి అంటూ పోస్టు పెట్టాడు.

ఇక సల్మాన్ అభిమానులు ఊరుకుంటారా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రాధే’ సినిమాతో పోల్చి మాట్లాడుతున్నారు. సినిమాలోనే కాదు బయటా సల్మాన్ హీరోనే అంటుంటే.. సినిమా హిట్ లేదా ప్లాఫ్ తో సంబంధం లేదు. సల్మాన్ భాయ్ కోసం మళ్లీ మళ్లీ సినిమా చూస్తామంటున్నారు నెటిజన్లు.

సల్మాన్ తన ఆపన్న హస్తం అందించడం తొలిసారేం కాదు. గతంలోనూ ఫస్ట్ వేవ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆహారం అందించాడు.