గడ్డి తిన్న సల్మాన్.. అనుపమ ఫోటోలు మార్ఫింగ్..

ఫామ్‌హౌస్‌లో గడ్డి రుచి చూసిన సల్మాన్ ఖాన్.. హ్యాకింగ్‌కి గురైన అనుపమ పరమేశ్వరన్ ఫేస్‌బుక్ అకౌంట్..

  • Published By: sekhar ,Published On : April 10, 2020 / 12:44 PM IST
గడ్డి తిన్న సల్మాన్.. అనుపమ ఫోటోలు మార్ఫింగ్..

Updated On : April 10, 2020 / 12:44 PM IST

ఫామ్‌హౌస్‌లో గడ్డి రుచి చూసిన సల్మాన్ ఖాన్.. హ్యాకింగ్‌కి గురైన అనుపమ పరమేశ్వరన్ ఫేస్‌బుక్ అకౌంట్..

కరోనా వైరస్‌విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా గత కొద్దిరోజులుగా బాలీవుడ్‌సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎవరికి వారు తమకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తూ.. ఈ విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.


సల్మాన్‌ఖాన్‌తన మేనల్లుడు ఆహిల్‌శర్మతో కలిసి ఫామ్‌లో సందడి చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఫామ్‌హౌస్‌లోనే లాక్ అయిపోయాడు భాయ్ జాన్. తాజాగా గుర్రానికి గడ్డి తినిపిస్తూ.. తాను కూడా కాస్త గడ్డి రుచి చూశాడు. ‘బ్రేక్ ఫాస్ట్ విత్ మై లవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు సల్మాన్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Breakfast with my love…

A post shared by Salman Khan (@beingsalmankhan) on

 

ఇదిలా ఉంటే మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది ఫేక్ పిక్ అని, తనది కాదని చెబుతూ ఒరిజినల్ ఫోటోను షేర్ చేసింది అనుపమ. ‘ఇలాంటి చెత్త పనులు చేసేందుకు సమయం దొరుకుతుంది. దయచేసి ఇలాంటి ఫేక్ ఫోటోలను వైరల్ చెయ్యొద్దు. ఇవి చాలా బాధ పెడతాయ’ని అనుపమ పోస్ట్ చేసింది. కాగా ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.