లాక్‌డౌన్‌లో వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్ ప్రారంభం నుంచి తన పన్వెల్ ఫాంహౌస్లో నివసిస్తున్నారు. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఈ రోజుల్లో వ్యవసాయం చేసేందుకు ఇష్టపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా, పొలంలో పనిచేస్తూ.. తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. లేటెస్ట్‌గా ఇప్పుడు తన పొలంలో వరిని నాటుతూ వీడియోను ట్వీట్ చేశాడు సల్మాన్ ఖాన్.
అంతకుముందు సల్మాన్ ఖాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ మొదట ట్రాక్టర్ వెనుక ఉన్న నాగలితో పొలాలను దున్నుతున్నాడు. ఆ తర్వాత ఒక ట్రాక్టర్ నడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ ఈ వీడియోను షేర్ చేసి, ‘ఫార్మింగ్’ అని రాశారు. ఈ వీడియోలో సల్మాన్ వరిని పండించడం కనిపిస్తుంది. వర్షంలో పొలాల్లో వారు ఎలా పని చేస్తున్నారో వీడియోలో చూపించారు.
లాక్‌డౌన్ సమయం నుంచి సల్మాన్ ఖాన్, యులియా వంతూర్ పన్వెల్ వద్ద ఫాంహౌస్‌లో నివసిస్తున్నారు. ఇద్దరూ నిరంతరం అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. వీరిద్దరి పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా షేర్ చేసిన వైరల్ వీడియో ఉంది.
Rice plantation done . . pic.twitter.com/uNxVj6Its4
— Salman Khan (@BeingSalmanKhan) July 20, 2020