Selmon Bhai : నన్ను అవమానిస్తున్నారు – సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్..పేరిట రూపొందిన పేరడి గేమ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముంబై సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది.

Salman
Salman Khan : బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్..పేరిట రూపొందిన పేరడి గేమ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముంబై సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది. ఈ గేమ్ ను రూపొందించిన నిర్వాహకులు…సల్మాన్..హిట్ అండ్ రన్ కు సంబంధించి ఓ పేరడీ వీడియో గేమ్ (సెల్మన్ భాయ్) ను రూపొందించారు. ఈ విషయం సల్మాన్ ఖాన్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కారు.
Read More : Supreme Court: సాక్ష్యం లేకుండా డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పేషెంట్ చనిపోయాడని ఎలా అంటాం?
ఈ వీడియో గేమ్ ద్వారా..తనను అవమాన పరుస్తున్నారంటూ..ముంబై సివిల్ కోర్టులో కంప్లైంట్ చేశారు. తన అనుమతి లేకుండానే..కమర్షియల్ గా లబ్ది పొందారంటూ పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. వీడియో గేమ్ ప్రమోషన్స్, లాంచింగ్, రీ లాంచింగ్ విషయాల్లో సల్మాన్ ఖాన్ కు సంబంధించి ఎలాంటి విషయాలు లేకుండా నిషేధించారని తెలుస్తోంది.
Read More : Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఎలాంటి పండ్లు తినాలంటే?
ఈ గేమ్ ని గూగుల్ ప్లే స్టోర్ లాంటి అన్ని ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని గేమ్ డెవలపర్స్ పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్…కొన్ని సంవత్సరాల క్రితం హిట్ అండ్ రన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. గేమ్ డెవలపర్స్ నిర్వాహకులు…దీనిపై పేరడీగా వీడియో గేమ్ ను రూపొందించారు.