Samajavaragamana : థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ స‌రికొత్త రికార్డును సృష్టించిన సామజవరగమన

యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) న‌టించిన చిత్రం సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ (Reba Monica John) హీరోయిన్‌.

Samajavaragamana : థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ స‌రికొత్త రికార్డును సృష్టించిన సామజవరగమన

Samajavaragamana

Updated On : July 30, 2023 / 7:57 PM IST

Samajavaragamana OTT record : యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) న‌టించిన చిత్రం సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ (Reba Monica John) హీరోయిన్‌. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మించారు. జూన్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా హౌస్ పుల్ క‌లెక్ష‌న్ల‌తో రికార్డులు సృష్టించింది.

Ramya Krishna : త‌మ‌న్నా పాట‌కు ర‌మ్య‌కృష్ణ చిందులు.. వీడియో వైర‌ల్‌

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద 1 మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ట్ చేసి శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఆహా వేదిక‌గా జూలై 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లోనే కాదు ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. 40 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆహా ఓటీటీ సంస్థ ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Rajinikanth : నేను జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు అదే.. సూప‌ర్ స్టార్ బిరుదుతో ఎప్పుడూ స‌మ‌స్యే : ర‌జినీకాంత్‌

గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను మొద‌ట‌గా ఓటీటీలో జూలై 28న విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. అయితే.. ప్రేక్ష‌కుల డిమాండ్ మేర‌కు ఒక రోజు ముందుగానే విడుద‌ల చేశారు. సీనియ‌ర్ న‌టుడు నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించి త‌మ‌దైన శైలిలో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా న‌రేశ్ కామెడి ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

Oppenheimer : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆట‌మ్ బాంబు ఓ రేంజ్‌లో పేలింది.. రెండు వారాల్లో 100 కోట్లు..