Samantha Akkineni: విడాకులపై సామ్ కూల్ రియాక్షన్..!
టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించగా హీరోయిన్‌గా సమంతకు..

Samantha Akkineni
Samantha Akkineni: టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించగా హీరోయిన్‌గా సమంతకు అదే మొదటి సినిమా కాగా చైతూకి రెండో సినిమా. ఇక్కడ నుండి మొదలైన వీరి ప్రేమ..పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత సమంత సినిమాలతోనే కాదు.. వెబ్ సిరీస్, టీవీషోలతో కూడా బిజీగా ఉండగా.. చైతూ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా లక్ పరీక్షించుకునే పనిలో ఉన్నాడు.
ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటూనే ఇద్దరూ కలిసి మాల్దీవులు, ఇతర దేశాలకు చెక్కేసి సేదదీరుతున్నారు. అయితే, ఈ మధ్య ఈ జంట విడిపోనుందని విడాకుల వరకు వెళ్లారని ఓ ప్రచారం పుట్టుకొచ్చింది. ఈ మధ్యనే సామ్ తన సోషల్ మీడియా ఖాతా ప్రొఫైల్ ను సమంత అక్కినేని నుండి సమంత ప్రభుగా మార్చుకుంది. దీంతో పుకార్ల రాయుళ్లకి ఊతంగా మారింది. ఓ లీడింగ్ టాబ్లాయిడ్ అయితే ఏకంగా త్వరలోనే ఈ జంట విడాకులంటూ చెప్పుకొచ్చేసింది.
అయితే.. ఈ ప్రచారంపై ఏ మాత్రం మాట్లాడని సమంత ఇప్పుడు మాత్రం తనదైన శైలిలో కూల్ గా కౌంటర్ ఇచ్చేసింది. ఈ జంట ఇటీవల గోవాలో కొంత భూమిని కొనుగోలు చేయగా.. ప్రస్తుతం అక్కడ సకల సౌకర్యాలతో ఫామ్‌హౌస్ నిర్మిస్తున్నారు. బీచ్ సమీపంలో నిర్మించే ఫామ్‌హౌస్ ను ఇప్పటికే ఇంటీరియర్స్ స్పెషలిస్టులు అప్పగించగా ఇది వచ్చే ఏడాదికి సిద్ధం కానుందట. ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్ దొరికినా భర్త చైతో కలిసి అక్కడ వాలిపోతానని సామ్ చెప్పుకొచ్చింది.