Samantha : సమంత అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది

సమంత ఎంత బిజీగా ఉన్నా రోజూ క్రమం తప్పకుండా చేసే పని వ్యాయామం ఒక్కటే. ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే విష‌యంలో సమంత ముందు ఉంటుంది. అప్పుడప్పుడు తాను చేసే ఎక్సర్ సైజులు, జిమ్ వర్కౌట్స్.....

Samantha : సమంత అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది

Samantha

Updated On : March 3, 2022 / 11:40 AM IST

 

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. సమంత ఎంత బిజీగా ఉన్నా రోజూ క్రమం తప్పకుండా చేసే పని వ్యాయామం ఒక్కటే. ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే విష‌యంలో సమంత ముందు ఉంటుంది. అప్పుడప్పుడు తాను చేసే ఎక్సర్ సైజులు, జిమ్ వర్కౌట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎంతటి కష్టతరమైన వ్యాయామం అయినా అవలీలగా చేస్తుంది సమంత. స్క్వాట్స్, ఏరోబిక్స్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్.. ఇలాంటివన్నీ చేస్తూ హెల్త్ ని బాగా మెయింటైన్ చేస్తుంది.

ఈ వీడియోలు షేర్ చేసేటప్పుడు అప్పుడప్పుడు తన ట్రైన‌ర్ జునైద్ షేఖ్ గురించి కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. జునైద్ సమంత వర్కౌట్స్ చేసేటప్పుడు పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సమంత అంత ఫిట్ గా ఉండటానికి జునైద్ కూడా కారణమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జునైద్ సమంత గురించి ప్రస్తావించాడు.

Jhund : నిర్మాతల కోసం పారితోషికం తగ్గించుకున్న అమితాబ్..

జునైద్ సమంత గురించి మాట్లాడుతూ.. ”స‌మంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది. నేను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా స‌మంత మరొక్క‌సారి చెయ్యి నేను ప్రయత్నిస్తా అంటుంది కాని చెయ్యను అని ఎప్పుడూ చెప్పదు. సామ్‌ చాలా దూకుడుగా ఉంటుంది. క‌ష్ట‌మైన ప‌నులు చేయాల‌నుకుంటుంది. సమంతని చూసి నేను స్పూర్తి పొందుతాను. డైలీ మిస్ అవ్వకుండా సమంత వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. ‘పుష్ప’ సినిమాలో ఊ అంటావా మావ ఊఊ అంటావా సాంగ్ కోసం సమంత చాలా వ‌ర్క‌వుట్ చేసింది ” అని తెలిపాడు.