Samantha : సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? నెటిజన్ అడిగిన ప్రశ్నకి క్లారిటీ ఇచ్చిన సమంత..
తాజాగా చాలా రోజుల తర్వాత సమంత నెటిజన్లతో ముచ్చటించింది. నేడు ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పింది.

Samantha Interesting Comments on her Second Marriage
Samantha : సమంత ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత తన బిజినెస్ లు, ఫౌండేషన్స్ పనులు చూసుకుంటుంది. త్వరలో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది.
తాజాగా చాలా రోజుల తర్వాత సమంత నెటిజన్లతో ముచ్చటించింది. నేడు ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్లు తమ ప్రశ్నలు అడగగా సమంత సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్స్ లు ఉన్నాయా అని అడిగారు.
దీనికి సమంత సమాధానమిస్తూ.. కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దీని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది చెడు పెట్టుబడి అవుతుంది అని తెలిపింది. ఇక సమంత షేర్ చేసిన నివేదికలో.. మొదటి సారి పెళ్లి చేసుకున్న వారు 50 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయి. రెండవసారి పెళ్లి చేసుకున్నవారు 67 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయి. మూడవసారి పెళ్లి చేసుకున్నవారు 70 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయి అని ఉంది.
Also Read : Bagheera Teaser : ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ‘భగీరా’ టీజర్ చూశారా.. సలార్ కంటే పవర్ ఫుల్ గా..
దీంతో ఇండైరెక్ట్ గా సమంత ఇంకో పెళ్లి చేసుకోదని క్లారిటీ ఇచ్చేసింది. మరి లైఫ్ లాంగ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా సమంతా ఇలాగే ఉంటుందా చూడాలి. దీంతో ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.