Samantha: ఆసుపత్రిలో సమంత..! చేయి బయటకు పెట్టి ఏం చెప్పాలనుకుంది?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన దూకుడును చూపిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతారలతో...

Samantha Interesting Yashoda First Glimpse
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన దూకుడును చూపిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ‘కతువాకుల రెండు కాదల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ స్టార్ బ్యూటీ. అయితే ఈ సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది సమంత. ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘శాకుంతలం’లో లీడ్ రోల్ చేస్తున్న సమంత, మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో కూడా నటిస్తుంది.
Samantha : ప్రేమకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా
హరి-హరీష్‌లు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ వీడియో చూస్తుంటే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌ను గమనించినట్లయితే, ఈ వీడియోలో సమంత ఓ ఆసుపత్రి బెడ్‌పై నుండి లేచి పక్కనే ఉన్న కిటికీవైపు నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ కిటికీ బయట ఓ పావురం ఉండగా, దాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలోనే పొడవైనా ఆ ఆసుపత్రి గోడలను చూపిస్తూ, టైటిల్ కార్డ్ వేశారు చిత్ర యూనిట్. అయితే ఈ గ్లింప్స్ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం.
Samantha : నా దయాగుణాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు.. సమంత సీరియస్ పోస్ట్..
సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్లు నటించే సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ వీడియోల్లో ఏదో ఒక డైలాగ్ ఉండేలా చూసుకుంటారు. కానీ సమంత నటిస్తున్న యశోద చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, ఎలాంటి డైలాగ్ లేకపోవడంతో.. ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో, ఇందులో సమంత పాత్ర ఏమిటో అనే అంశాలు ఏమాత్రం గెస్ చేయడానికి వీలు లేకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడ్డారు. ఇక ఈ సినిమాలో సమంతతో పాటు మరో నటి వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ లాంటి స్టార్స్ నటిస్తుండగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.