Samantha : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన సమంత..
సమంత చేతిలో ఉన్న సినిమాల్లో ఖుషి ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా, శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా ఆల్రెడీ కొంతభాగం షూటింగ్ చేసుకుంది. కానీ సమంతకి హెల్త్ సమస్య ఉండటంతో..........

Samantha says sorry to Vijay Devarakonda Fans in Twitter
Samantha : ఇటీవల యశోద సినిమా రిలీజ్ సమయంలో తనకి మాయోసైటిస్ వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పింది సమంత. కొన్ని రోజులు చెన్నైలోని ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది సమంత. గత కొన్ని రోజులుగా ఇప్పుడిప్పుడే సామ్ బయటకి వస్తుంది. ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత, ప్రస్తుతం షూటింగ్స్ కి వెళ్తుంది.
సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే ఇటీవల జిమ్ కి కూడా వెళ్తూ తన వర్కవుట్ వీడియోల్ని పోస్ట్ చేసింది. దీంతో సమంత ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంతోషిస్తున్నారు. సమంత చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ తనకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇన్నాళ్లు షూటింగ్స్ ఆగాయి. ఇప్పుడు సమంత బ్యాక్ టు వర్క్ అవడంతో ఒక్కొక్క షూట్ ని మొదలుపెడుతుంది.
ఇక సమంత చేతిలో ఉన్న సినిమాల్లో ఖుషి ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా, శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా ఆల్రెడీ కొంతభాగం షూటింగ్ చేసుకుంది. కానీ సమంతకి హెల్త్ సమస్య ఉండటంతో షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే శివ నిర్వాణ ఖుషి సినిమాపై అప్డేట్ ఇస్తూ త్వరలో షూటింగ్ మొదలవ్వనుంది అని తెలిపాడు.
Unstoppable : పవన్ ఫ్యాన్స్‌కి ఇంకొంచెం ముందుగానే పండుగ.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ ముందే రిలీజ్..
తాజాగా ఓ నెటిజన్ సమంతని ఖుషి సినిమా ఏమైంది అని అడగడంతో ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ సమంత.. విజయ దేవరకొండ అభిమానులకు సారీ. ఖుషి సినిమా త్వరలోనే మొదలవుతుంది అని చెప్పింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారగా, సినిమా మొదలవుతున్నందుకు సమంత అభిమానులు, విజయ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans ?@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023