Dasara : ముచ్చటగా మూడోసారి..

నేచురల్ స్టార్ నాని - సమంత కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ‘దసరా’..

Dasara : ముచ్చటగా మూడోసారి..

Nani Samantha

Updated On : October 31, 2021 / 4:57 PM IST

Dasara: నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నాడు. ఇటీవల ‘టక్ జగదీష్’ తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలు చేస్తున్నాడు నాని.. ‘శ్యామ్ సింగ రాయ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

దసరా పండుగ నాడు.. ‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదు’ అంటూ ‘దసరా’ అనే మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ‘సైరన్ ఆఫ్ దసరా’ పేరుతో రిలీజ్ చేసిన వీడియోకు, నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నేను లోకల్’ తర్వాత కీర్తి సురేష్ నానికి జోడీగా నటిస్తోంది.

NANI 29 : ఈ దసరా నిరుడు లెక్క ఉండదు..

ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సమంతను ఫిక్స్ చేశారని సమాచారం. వీళ్లిద్దరూ ఇంతకుముందు ‘ఎటోవెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ సినిమాలు చేశారు. ఇది మూడో సినిమా. త్వరలో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రరాంభం కానుంది. పాపులర్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’