Samantha: అన్ని ఏరియాలు కవర్ చేస్తోన్న సామ్.. నెక్ట్స్ ఏంటి?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే టాలీవుడ్లో శాంకుతలం, యశోద చిత్రాలతో బిజీగా ఉన్న సమంత....

Samantha To Debut In Both Hollywood And Bollywood
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే టాలీవుడ్లో శాంకుతలం, యశోద చిత్రాలతో బిజీగా ఉన్న సమంత ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తోంది. ఇక ఈ సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులను ఆమె పరిశీలిస్తోంది. అయితే కేవలం టాలీవుడ్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ సామ్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.
Samantha : యాడ్ కోసం సమంత.. ఒకేసారి పది డ్రెస్సులతో ఫొటోషూట్
ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ జనాలను మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తోంది. పలువురు దర్శకనిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటించాల్సిందిగా కోరుతుండగా, సమంత ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన కథలను వింటున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ బ్యూటీ కేవలం బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ ఎంట్రీకి రెడీ అయ్యింది.
Samantha : ముగ్గురు ముగ్గురే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన హీరోయిన్స్..
హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ గతంలోనే సమంతను ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే సినిమాలో నటించాల్సిందిగా కోరగా, ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా సమంత అన్ని ఏరియాలను కవర్ చేయాలని చూస్తోంది. మరి ఈ బ్యూటీకి టాలీవుడ్లో దక్కిన స్టార్ ఇమేజ్ మిగతా ఇండస్ట్రీల్లో దక్కుతుందో లేదో చూడాలి.