Samantha : ఆస్ట్రియా అయిపోయింది.. ఇప్పుడు ఇటలీ.. యూరప్ మొత్తాన్ని చక్కర్లు కొట్టేస్తున్న సమంత..

తాజాగా ఆస్ట్రియా నుంచి ఇటలీకి వెళ్ళింది సమంత. ఇటలీలో వెనిస్ నగరానికి వెళ్లి అక్కడి ప్రదేశాలని తిరిగేస్తుంది.

Samantha : ఆస్ట్రియా అయిపోయింది.. ఇప్పుడు ఇటలీ.. యూరప్ మొత్తాన్ని చక్కర్లు కొట్టేస్తున్న సమంత..

Samantha Travelled Austria to Italy Enjoying in Venice Shares Photos

Updated On : October 2, 2023 / 10:55 AM IST

Samantha :  ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం దేశాలు తిరిగేస్తుంది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే ఇటు మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత పలు ప్రదేశాలను సందర్శిస్తుంది.

మొదట కొన్ని రోజులు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి వెళ్లి అక్కడ ప్రశాంతత కోసం ధ్యానం, పూజలు చేసిన సమంత ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలికి(Bali) వెళ్లి బీచ్, ప్రకృతి ప్రదేశాల్లో గడిపింది. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ న్యూయార్క్ లోని ప్రదేశాలు ఎంజాయ్ చేస్తూ అలాగే మయోసిటిస్ చికిత్స తీసుకుంటుంది. ఇటీవల రెండువారాల క్రితం అమెరికా పైనుంచి యూరప్ లోని ఆస్ట్రియా దేశానికి వెళ్ళింది సమంత.

ఆస్ట్రియాలో సెల్జ్ బర్గ్ నగరంలో గత రెండు వారాలుగా ఎంజాయ్ చేస్తూ, అక్కడి ప్రదేశాలని తిరుగుతూ పలు ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఆస్ట్రియా నుంచి ఇటలీకి వెళ్ళింది సమంత. ఇటలీలో వెనిస్ నగరానికి వెళ్లి అక్కడి ప్రదేశాలని తిరిగేస్తుంది. వెనిస్ లోని పలు ప్రదేశాలని ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అక్కడ దేనికోసమో లైన్ లో నించుంది సమంత. ఆ ఫోటోని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత ఇటలీలో సేద తీరుతుంది..

Also Read : Tamil Bigg Boss 7 : తమిళనాట మొదలైన బిగ్‌బాస్ సందడి.. తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్..

ఇలా దేశాలు తిరిగేస్తుండటంతో సమంత వరల్డ్ టూర్ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని భావిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.