Acharya: సానా కష్టం వచ్చిందే మందాకినీ.. స్పెషల్ సాంగ్ వచ్చేసింది!
సోషల్ ఎలిమెంట్స్ ను పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేలో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే.

Rejina
Acharya: సోషల్ ఎలిమెంట్స్ ను పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేలో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సరైన సమయం కోసం వేచిచూస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు, కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తుండగా.. రామ్ చరణ్-పూజ హెగ్డే మరో ప్రధాన ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.
Rowdy Boys: కృష్ణుడు వచ్చాడే.. రాధను చూశాడే.. ‘రౌడీ బాయ్స్’ సాంగ్ రిలీజ్!
ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ అయి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా.. తాజాగా ‘ఆచార్య’ నుంచి ఓ ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు. సానా కష్టం వచ్చిందే మందాకిని అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ రెజీనా చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం విశేషం. చిరంజీవి కూడా తన డ్యాన్స్ గ్రేస్ తో మళ్ళీ పాత మెగాస్టార్ ని మరోసారి గుర్తు చేశారు. ఈ పాటను భాస్కర్ భట్ల రచించగా సింగర్ రేవంత్ గీతామాధురి ఆలపించారు.
RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1
ఈ సాంగ్ కి థియేటర్లో అభిమానులు రచ్చ చేస్తారని అర్థమైపోతుంది. ఈ సాంగ్ తో రెజీనా కూడా ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇక ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించగా అప్పటికి పరిస్థితులు చక్కబడితే చెప్పిన తేదీకే వచ్చేసి మెగా అభిమానులకు డబుల్ బొనాంజా ట్రీట్ ఇవ్వనుంది.