Sandeep Vanga : యానిమల్ విషయంలో సందీప్ వంగా రిస్క్ చేస్తున్నాడా??
‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి. అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ క్రెడిట్ తోనే సందీప్ లేటెస్ట్ గా ‘యానిమల్’ మూవీతో మరోసారి బాలీవుడ్ లో తన టాలెంట్ చూపించబోతున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న..............

Sandeep Vanga is producer also for Animal Movie
Sandeep Vanga : ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి. అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ క్రెడిట్ తోనే సందీప్ లేటెస్ట్ గా ‘యానిమల్’ మూవీతో మరోసారి బాలీవుడ్ లో తన టాలెంట్ చూపించబోతున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్ లో మొదటి సినిమా అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆ కథను ఎంతోమంది యంగ్ హీరోలు రిజెక్ట్ చేసినప్పటికీ, విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకం పెట్టుకొని సినిమా చేసి సంచలనం సృష్టించాడు. తన సోదరుడు ప్రణయ్ రెడ్డితో కలిసి ఈ సినిమాని నిర్మించాడు సందీప్. సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అందించింది. అయితే అప్పుడు బడ్జెట్ 6 కోట్లు మాత్రమే. ప్రాఫిట్స్ 10 కోట్లదాకా వచ్చాయి.
మళ్లీ అదే కథను బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ పేరుతో డైరెక్ట్ చేసినప్పుడు మాత్రం సందీప్ రెడ్డి రిస్కు చేయలేకపోయాడు. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టకుండా కేవలం రెమ్యునరేషన్ తీసుకుని అతను సైడ్ అయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం యానిమల్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి చాలా రిస్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. T సీరీస్ తో పాటు సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యానిమల్ కు 80 నుంచి 100 కోట్ల మధ్యలో ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కు తక్కువ కాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ భాషలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. రణబీర్ కపూర్ , రష్మిక మందన్నా జోడీగా నటిస్తున్న ఈ సినిమాకి అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది. న్యూఇయర్ సందర్బంగా రిలీజైన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రక్తమోడుతున్న శరీరంతో, చేతిలో గొడ్డలితో గడ్డం గెటప్ లో రణబీర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణంలో కూడా సందీప్ భాగమవ్వడంతో అసలే బాలీవుడ్ సినిమా రిస్క్ చేస్తున్నాడేమో అని పలువురు భావిస్తున్నారు. మరి ఆగస్టులో రిలీజయ్యే ఈ యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి బాలీవుడ్ లో ఏ రేంజ్ హిట్టందుకొని లాభాలు సాధిస్తాడా చూడాలి.