Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. మనసు మార్చుకుంటారా?

టాలీవుడ్ లో రిలీజ్ క్లాష్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ సినిమాలు అడ్డులేకుండా ఏ స్టార్ హీరోలు అడ్డురాకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా కూడా.. ఎవరో ఒకరొచ్చి షెడ్యూల్ మాత్రం..

Sankranti 2022 Films: సంక్రాంతి పందెం కోళ్లు.. మనసు మార్చుకుంటారా?

Sankranti 2022 Films

Updated On : October 5, 2021 / 3:13 PM IST

Sankranti 2022 Films: టాలీవుడ్ లో రిలీజ్ క్లాష్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ సినిమాలు అడ్డులేకుండా ఏ స్టార్ హీరోలు అడ్డురాకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా కూడా.. ఎవరో ఒకరొచ్చి షెడ్యూల్ మాత్రం డిస్టర్బ్ చేసేస్తున్నారు. లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో.. మళ్లీ సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ మార్చుకునే పనిలోఉన్నాయి. ఇంతకీ సర్కారు వారి పాట.. భీమ్లా నాయక్ కొత్త రిలీజ్ డేట్స్ ఏంటన్న చర్చ జరుగుతోంది.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

సెకండ్ వేవ్ సినిమాల మధ్య గొడవల్ని తెచ్చింది. సీజన్ కోసం వెయిట్ చేసి సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. కానీ సడెన్ గా రాజమౌళి ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో మరోసారి రిలీజ్ డేట్స్ గురించి ఆలోచనలో పడ్డారు మేకర్స్ . ట్రిపుల్ ఆర్ జనవరి 7 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజే పుష్ప కూడా క్రిస్ మస్ రిలీజ్ నుంచి ఒక వారం ముందుకొచ్చింది. సో..క్రిస్మస్ ఖాళీని ఆచార్య ఫిల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

రాజమౌళి జనవరి 7న రావడంతో .. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలు డేట్స్ చేంజ్ చేసుకందామన్న ఆలోచనలో పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ విషయంలో సంక్రాంతికే వస్తానన్న ప్రభాస్ మాత్రం రిలీజ్ డేట్ మార్చే ప్రసక్తే లేదని మరోసారి కన్ ఫామ్ చేసింది. అయితే సర్కారు వారి పాట మాత్రం సంక్రాంతి బరిలోనుంచి తప్పుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

Shruti Haasan: ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. శృతి షాకింగ్ రిప్లై!

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ ను జనవరి 13 సంక్రాంతి నుంచి తప్పించినా.. పవర్ స్టార్ మూవీ భీమ్లానాయక్ ఇంకా బరిలోనే ఉన్నారు. మొన్నా మధ్య జనవరి 12నే రిలీజ్ అని మరోసారి కన్ ఫామ్ చేసిన పవన్ కళ్యాణ్.. రాజమౌళి రింగులోకి దిగుతున్నారు కాబట్టి మనసు మార్చుకుని డేట్ మార్చుకుంటారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే మనసు మార్చుకొని కొత్త డేట్స్ ఇస్తారా.. లేక నో ఛాన్స్ వెనక్కు తగ్గేదేలేదని అదే పండగకి వస్తారా చూడాల్సి ఉంది.