లాభాల బాటలో సూపర్‌స్టార్ సరిలేరు
బయ్యర్లను లాభాల బాట పట్టించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..

బయ్యర్లను లాభాల బాట పట్టించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..
సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌డే నుండే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందీ సినిమా.
సరిలేరు కేవలం ఆరు రోజుల్లోనే ఏపీ, తెలంగాణల్లో రూ 112.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మహేష్ బాబు సినిమాల్లో తొలివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. అన్ని ఏరియాల్లోనూ నాన్ బాహుబలి 2 రికార్డులను కైవసం చేసుకుని సంక్రాంతి ఛాంపియన్‌గా నిలిచింది మహేష్ మూవీ.
తెలుగు రాష్ట్రాల్లో రూ 75.70 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడవగా ఆరు రోజుల్లోనే రూ 77.94 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లను లాభాల బాట పట్టేలా చేసింది. ఇక నుండి వచ్చేదంతా వారికి లాభమే. ముందు ముందు సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరి.