‘‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’’..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Published By: sekhar ,Published On : November 22, 2019 / 11:56 AM IST
‘‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’’..

Updated On : November 22, 2019 / 11:56 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వచ్చేసింది.. మహేష్, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ విడుదల చేశారు. ‘‘మీరెవరో మాకు తెలీదు.. మీకూ మాకూ ఏ రక్త సంబంధమూ లేదు.. కానీ మీకోసం, మీ పిల్లల కోసం పగలూ, రాత్రీ, ఎండా, వానా అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత’’ అంటూ మహేష్ చెప్పే డైలాగుతో టీజర్ స్టార్ట్ అవుతోంది.

‘‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్నెలా చంపుకుంటానురా.. మీకోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ.. మీరేమో కత్తులూ, గొడ్డల్లూ ఏసుకుని ఆడాళ్ల మీద.. బాధ్యత ఉండక్కర్లా’’.. అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ బాగుంది. ప్రాణాలు కాపాడే సోల్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండు వేరియేషన్స్‌లో చెప్పిన ఈ డైలాగ్ ఆకట్టుకుంటుంది.. ‘‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’’ అంటూ సూపర్ స్టార్ పేల్చిన పంచ్ అదిరిపోయింది..

Read Also : ‘ఆలోచిస్తేనే నాన్న పేరు.. రాలుతుంది నా హెయిర్ – ఓ మై గాడ్ డాడీ’ ఫుల్ సాంగ్

‘‘గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్’’ అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్ ఆలోచింపచేస్తుంది. టీజర్ చివర్లో ‘‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో అనిల్ మార్క్ ఫన్ కూడా ఉండబోతుందని అర్ధమవుతోంది. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా మరో డిఫరెంట్ మూవీ కాబోతోందని, అనిల్ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్ మార్క్‌తో పాటు మెసేజ్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.