ప్రముఖ దర్శకుని చేతుల మీదుగా విడుదలైన ‘తూనీగ’ ఫస్ట్ లుక్

ఒక దైవ రహస్యం.. ఒక ఇతిహాస తరంగం.. తూనీగ.. అతిత్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ సినీ దర్శకులు, శతమానం భవతి ఫేమ్ సతీశ్ వేగేశ్న విడుదల చేశారు. వినీత్ చంద్ర, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ సినిమా పోస్టర్‌ని విడుదల చేసిన ఆయన.. చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.
అంతా కొత్తవారే కలిసి సమష్టి కృషితో తెరకెక్కిస్తున్న తూనీగ సినిమా ఘన విజయం సాధించాలని, దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ మరిన్ని మంచి సినిమాలను రూపొందించి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అయిన శ్రీకాకుళంకు చెందిన యువకులు తీసిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది అని సతీశ్ వేగేశ్న అన్నారు.
శ్రీకాకుళం నుంచి ఎందరెందరో మహనీయులు పుట్టారని, ఉద్యమ గుణం, అందరినీ ఆదరించే లక్షణం, శ్రమనే వేదంగా భావించే తత్వం పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతీయులు తీస్తున్న తూనీగ సినిమా అఖండ విజయం అందుకోవాలని ఆయన ఆశీర్వదించారు. కథాబలం ఉన్న ఇటువంటి సినిమా తప్పకుండా ఆడుతుందని ఆయన అన్నారు.
ఈ సినిమాకి సంగీతం సిద్ధార్థ్ సదాశివుని అందించగా.. సినిమాటోగ్రఫీ హరీశ్ ఎదిగ సమకూర్చారు. ఎడిటర్‌గా ఆర్కే కుమార్, పోస్టర్ డిజైనర్‌గా వర్థమాన డిజిటల్ ఆర్టిస్ట్ MKS మనోజ్.. పీఆర్ఓగా రచయిత రత్నకిశోర్ శంభుమహంతి వ్యవహరిస్తున్నారు.
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని, అదేవిధంగా నిర్మాణాంతర పనులు సైతం శరవేగంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్న చిత్రం అయినా సాంకేతికత విషయంలో ఎక్కడా రాజీచపడట్లేదని చెప్పారు. ప్రేక్షకుడికో కొత్త అనుభూతి అందించేలా సినిమాను చిత్రీకరించినట్లు చెప్పారు. తమ ప్రయత్నానికి మద్దతు పలుకుతూ సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు.