Sebastian P.C. 524 Trailer: ఓడెమ్మ.. అండర్ ది కంట్రోల్ అఫ్ సెబాస్టియన్ ఇక్కడ!

కిరణ్ అబ్బవరం హీరోగా.. నువేక్ష హీరోయిన్ గా నటించిన సినిమా 'సెబాస్టియన్ PC 524'. జ్యోవిత-ఎలైట్ సంస్థలు ఈ సినిమాతో బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మార్చి 4వ తేదీన..

Sebastian P.C. 524 Trailer: ఓడెమ్మ.. అండర్ ది కంట్రోల్ అఫ్ సెబాస్టియన్ ఇక్కడ!

Sebastian P.c. 524 Trailer

Updated On : February 28, 2022 / 12:36 PM IST

Sebastian P.C. 524 Trailer: కిరణ్ అబ్బవరం హీరోగా.. నువేక్ష హీరోయిన్ గా నటించిన సినిమా ‘సెబాస్టియన్ PC 524’. జ్యోవిత-ఎలైట్ సంస్థలు ఈ సినిమాతో బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తుండగా ఇప్పటికే విడుదలైన ప్రీ-రిలీజ్ వీడియోలు, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. సోమవారం ట్రైలర్ కూడా వదిలారు. ఈ సినిమాలో హీరో కిరణ్ పోలీస్ కానిస్టేబుల్ కాగా అతను రేచీకటితో ఇబ్బంది పడుతుంటాడు.

అన్నా చీకటిగా ఉందని ఒకతని డైలాగ్ తో మొదలయ్యే ట్రైలర్ లో ఓడెమ్మ.. అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెబాస్టియన్ ఇక్కడ అంటూ కిరణ్ బిల్డప్ ఇస్తూ మేనేజ్ చేస్తుంటాడు. తనకి నైట్ షిఫ్టులు వేయవద్దని బాస్ ను బ్రతుమలాడుకుంటే.. ఆయనేమో ఇదేమన్నా సాఫ్ట్ వేర్ ఆఫీస్ అనుకుంటున్నావా షిఫ్ట్ లో పనిచేయను అంటూ సెబాస్టియన్ మాటలను పట్టించుకోడు. దీంతో తన నైట్ డ్యూటీ చేసి పెట్టమని మరో పోలీస్ లను రిక్వెస్ట్ చేస్తే ఆయన నీకన్నా నాకు చాలా భయం.. అసలే కొత్తగా పెళ్లయిందని చెప్పడం ఫన్నీగా ఉంటుంది.

ఇలారోజులు బాగానే గడిచిపోతున్నాయని అనుకునే సమయంలోనే అతను నైట్ డ్యూటీ చేయవలసి వస్తుంది. ఆ రాత్రి అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందనేదే కథ. ట్రైలర్ చూస్తే ఆసక్తికరమైన ట్విస్టులతో పాటు, కామెడీ కూడా కావాల్సినంత ఉందనే విషయం అర్థమవుతోంది. ఇక హీరోయిన్ గ్లామర్.. రొమాన్స్ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మార్చి 4న శ్వరానంద్ ఆడవాళ్ళతో కలిసి వస్తుండగా అదే రోజు సెబాస్టియన్ కూడా రేచీకటితో రాబోతున్నాడు.