Save The Tigers 2 : ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 రెడీ అవుతుంది.. ఈసారి ఆ అందాల భామ..
‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 షూటింగ్ మొదలయింది. ఇక ఈ సీజన్ లో ఆ అందాల భామ..

Seerat Kapoor joins in Save The Tigers season 2 web series cast and crew
Save The Tigers 2 : వెబ్ సిరీస్ లకు ప్రేక్షాధారణ పెరుగుతుండడంతో మేకర్స్.. సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ని కూడా వరుస పెట్టి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈక్రమంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సేవ్ ది టైగర్స్’. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, పావని.. ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. మహి వి. రాఘవ, ప్రదీప్ అద్వైతం క్రియేషన్ లో తేజ కాకుమాను ఈ సిరీస్ ని డైరెక్ట్ చేశాడు. మొత్తం ఆరు ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.
దీంతో ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సీజన్ 2 ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్తామంటూ మహి వి. రాఘవ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్ షూటింగ్ పట్టాలు ఎక్కింది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సీజన్ లో మరో కొత్త యాక్ట్రెస్ వచ్చి జాయిన్ అవ్వబోతుంది. ‘రన్ రాజా రన్’ మూవీ హీరోయిన్ సీరత్ కపూర్ (Seerat Kapoor) ఈ సిరీస్ లో నటించబోతుంది. తాజాగా ఈ భామ సీజన్ 2 షూటింగ్ లో ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేసింది.
Also Read : Aamir Khan : రీ ఎంట్రీ ఇస్తున్న ఆమిర్ ఖాన్.. కానీ నటుడిగా కాదు..
“సేవ్ ది టైగర్స్ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని విన్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి నేను కూడా వస్తున్నాను. హంసలేఖని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి” అంటూ రాసుకొచ్చింది. ఇక వీడియోలో సీరత్.. సిమ్మింగ్ పూల్ లో బికినీ పై కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి సీజన్ 1 తో అందరిని ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన సేవ్ ది టైగర్స్.. సీజన్ 2 తో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారో చూడాలి.
View this post on Instagram