Shah Rukh Khan : హ్యాట్రిక్ కోసం మరో మూవీని రిలీజ్‌కి సిద్ధం చేస్తున్న షారుఖ్..

షారుఖ్ ఖాన్ కి ఈ ఏడాది కలిసి రావడంతో.. మరో సినిమాని కూడా రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు.

Shah Rukh Khan : హ్యాట్రిక్ కోసం మరో మూవీని రిలీజ్‌కి సిద్ధం చేస్తున్న షారుఖ్..

Shah Rukh Khan plans to release Dunki on this year december

Updated On : September 10, 2023 / 6:22 PM IST

Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ప్లాప్‌ల్లో ఉన్న తాను కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ కి మళ్ళీ పూర్వవైభవం తీసుకు వచ్చాడు. జనవరిలో పఠాన్ (Pathaan) తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న షారుఖ్.. రీసెంట్ గా జవాన్ (Jawan) సినిమాతో కూడా బిగ్గెస్ట్ హిట్టుని నమోదు చేశాడు. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని రిలీజ్ కి సిద్ధం చేసేస్తున్నాడు. ఆ మూవీతో కూడా హిట్ కొట్టి ఈ ఏడాది హ్యాట్రిక్ సక్సెస్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.

Naveen Polishetty : ఆ ఒక్క ట్వీట్ చూశాక‌.. రాత్రంతా నిద్ర పోలేదు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘డంకీ’ (Dunki). 3 ఇడియట్స్, PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ ని రాజ్ కుమార్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఆ దర్శకుడితో షారుఖ్ సినిమా అంటే.. ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం పూర్తి అయ్యిపోయినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Mega157 : చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఇక అడ్వెంచర్ షురూ..

అయితే రిలీజ్ డేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2024 జనవరిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ముందుగా చెప్పినట్లు ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లోనే బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కానుందట. మరి డంకీతో కూడా సక్సెస్ అందుకొని షారుఖ్ హ్యాట్రిక్ సాధిస్తాడా..? లేదా..? చూడాలి.